Inter Student Died in Stone Crusher Quarry at Hyderabad : ఇంటర్ చదివే వయస్సు చాలా ప్రమాదంతో కూడుకున్నది. విద్యార్థులు ఏమాత్రం అజాగ్రత్తగాా ఉన్నా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కౌమార దశలో ప్రతిదానికి ఆకర్షితులు అవుతారు. కానీ అందులో ప్రమాదం దాగి ఉందన్న విషయాన్ని తెలుసుకోలేరు. ఈ విధంగానే ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం ఓ రిసార్ట్‌కు వెళ్లాడు. అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న స్టోన్ క్రషర్ క్వారీకి వెళ్లాడు.
క్వారీ సీనరీ అందంగా కనిపించే సరికి ఫొటోలు దిగాలని విద్యార్థి ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే ఫొటోలు తీస్తూ కాలు జారి ఆ క్వారీలో పడిపోయాడు. ఈత రాక అందులో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
'JEE చదవలేను, అమ్మా, నాన్న క్షమించండి'- కోటాలో మరో విద్యార్థి సూసైడ్
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాాబాద్‌లోని ఈసీఐఎల్ కమలానగర్లో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో బండారు అభినవ్ అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. శుక్రవారం తన స్నేహితుడు నిరంజన్ పుట్టిన రోజు వేడుకల కోసం యాద్గార్పల్లి గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ గడిపిన తర్వాత, పక్కనే ఉన్న స్టోన్ క్రషర్ మిల్లులో ఉన్న క్వారీలో ఫొటోలు దిగేందుకు వెళ్లారు. ఆ ఫొటోలు తీసే క్రమంలో అభినవ్ కాలు జారి పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్నేహితులు స్థానికులకు తెలియజేశారు.
భువనగిరి గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం - చికిత్స పొందుతూ విద్యార్థి మృతి - Gurukula Student Died
Inter Student Abhinav Died in Quarry : గ్రామస్థులు క్వారీ విద్యార్థి పడిపోయిన విషయాన్ని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. విషయాన్ని తెలుసుకున్న రక్షకభటులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి గాలించగా, ఇవాళ మధ్యాహ్నం విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఖమ్మం జిల్లా పెట్ గ్రామానికి చెందిన బండారు హరికృష్ణ కుమారుడిగా గుర్తించారు. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించామని పోలీసులు తెలిపారు.