ETV Bharat / state

'కూతురు స్పృహ తప్పిందని ఫోన్ చేశారు - వెళ్లి చూస్తే ఉరేసుకుని చనిపోయింది'

బాచుపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య - విద్యార్థినిని కాలేజీలో వదిలివెళ్లిన తల్లిదండ్రులు - కాసేపటికే కూతురు చనిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Inter Student Suicide At Bachupally
Inter Student Suicide At Bachupally (ETV Bharat)

Inter Student Suicide At Bachupally : దసరా సెలవులు ముగిశాయి. మెల్లమెల్లగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల బాట పడుతున్నారు. అయితే సెలవులు ముగిసి వారం కావొస్తున్నా కొంతమంది ఇంకా ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కాలేజీలకు వెళ్తున్నారు. అలాగే ఓ విద్యార్థినిని తల్లిదండ్రులు కాలేజీ హాస్టల్​లో దింపేందుకు వెళ్లారు. కూతుర్ని హాస్టల్​లో దింపి తమ గ్రామానికి తిరిగి పయనమయ్యారు. ఇంతలోనే కాలేజీ నుంచి హఠాత్తుగా ఓ ఫోన్ కాల్ పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. అసలేం జరిగిందంటే?

కాలేజీ హాస్టల్​లో కుమార్తెను దించి ఇంటికి బయలుదేరిన ఆ తల్లిదండ్రులు ఇల్లు చేరకముందే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. దారి మధ్యలోంచే తిరిగి వచ్చిన ఆ కన్నవాళ్లు విగతజీవిగా పడి ఉన్న కుమార్తె మృతదేహం చూసి హతాశులయ్యారు. ఈ విషాద ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

కలసి ఉండలేమని తల్లడిల్లి ఏకంగా లోకాన్నే వీడి వెళ్లి - యువ ప్రేమికుల కన్నీటిగాథ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈమెకు హాస్టల్​లో ఉండటం ఇష్టం లేదని సమాచారం. అందుకే దసరా సెలవులు ముగిసి వారం కావొస్తున్నా కాలేజీకి వెళ్లలేదు.

స్పృహ తప్పిపడిపోయిందని ఫోన్ కాల్ : ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం కారులో తీసుకొచ్చి తల్లిదండ్రులు ఆమెను హాస్టల్​లో దించి వెళ్లారు. ఆ సమయంలో ఇంటికి బయలుదేరిన వారిని ఆమె ఆనందంగా సాగనంపింది. కూతురు హాస్టల్​లో బాగానే ఉంటుందని అనుకున్న ఆ కన్నవాళ్లు వచ్చిన కారులోనే తిరిగి ప్రయాణమయ్యారు. సగం దూరం వెళ్లగానే హాస్టల్‌ నుంచి తమ కుమార్తె స్పృహ తప్పిపడిపోయిందని ఫోన్ కాల్ వచ్చింది.

ఇక వెంటనే వారు కంగారుగా తిరిగి హాస్టల్​కు చేరుకున్నారు. అక్కడకు వచ్చిన తర్వాత కూతురు శవాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసి గుండెలవిసేలా రోదించారు. గంట ముందు వరకు నవ్వుతూ హాయిగా కనిపించిందని, ఇంతలోనే ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదంటూ ఆ కన్నవాళ్లు పెట్టిన రోదనలు అక్కడున్న వారితో కన్నీళ్లు పెట్టించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య

స్నేహితుల ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు - అలా తయారయ్యాడని దూరం పెట్టేసరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.