ETV Bharat / state

మూడు చక్రాల సైకిల్‌తోనే బతుకు పోరాటం​ - పదిహేనేళ్లుగా సర్కార్​ సాయమందని దివ్యాంగుడు - Warangal Handicapped Man Story - WARANGAL HANDICAPPED MAN STORY

Special Story on Handicapped Person : అతను పుట్టుకుతోనే దివ్యాంగుడు. అయినా సరే, ఎవరిపైనా ఆధారపడకుండా మనోధైర్యంతో జీవనాన్ని సాగిస్తున్నాడు. పేద కుటుంబంలో పుట్టినా తల్లిదండ్రులు, తోబుట్టువుల సాయం లేకుండా స్వశక్తితో జీవిస్తున్నాడు. మూడు చక్రాల సైకిలే తనకు జీవనాధారం. కొన్నేళ్లుగా దాని సాయంతోనే బతుకు పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.

Special Story on handicapped
Inspirational Story of Handicapped Man in Warangal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 6:54 AM IST

Special Story on Handicapped Ratnakar in Warangal : హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లికి చెందిన బోట్ల రత్నాకర్ పుట్టుకతోనే దివ్యాంగుడు. చిన్నతనం నుంచి పోలియో కారణంగా తన రెండు కాళ్లు పనిచేయకుండా చచ్చుబడిపోయాయి. అయినప్పటికీ మానసికంగా కుంగిపోకుండా మనోధైర్యం కూడబెట్టుకొని స్వశక్తితో బతకాలని పట్టుదలతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

మూడు చక్రాల సైకిల్‌తోనే బతుకు పోరాటం​ - పదిహేనేళ్లుగా సర్కార్​ సాయమందని దివ్యాంగుడు (ETV Bharat)

మూడు చక్రాల సైకిల్‌తోనే బతుకు పోరాటం : రోజు ఉదయాన్నే లేచి మూడు చక్రాల బండి సాయంతో ఇంటింటికి తిరుగుతూ న్యూస్‌ పేపర్లు వేస్తూ ఉంటాడు. అనంతరం అదే గ్రామంలో తనకున్న టీవీ రిపేరింగ్ షాపులో పలురకాల ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేరు చేస్తుంటాడు. ఇందుకోసం ఏవైనా వస్తువులు అవసరమైతే, అదే మూడు చక్రాల బండిపై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పరకాల పట్టణానికి వెళ్లి తెచ్చుకుంటాడు.

"చిన్నప్పటి నుంచే నాకు కాళ్లు లేవు. అయినప్పటికీ కష్టపడుతూనే జీవనం సాగిస్తున్నాను. మా నాన్న చనిపోయాక అమ్మ, అన్నలపై ఆధారపడకుండా స్వశక్తితో సంపాదించుకుంటూ బతుకుతున్నాను. పదిహేనేళ్లుగా ఇంటింటికి తిరుగుకుంటూ పేపర్ వేస్తున్న, ఆ తరువాత షాపు తీసుకుని ఏదో చిన్న వర్క్ చేస్తూ పూట గడుపుకుంటున్నాను. ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గత ముప్ఫై ఏళ్లుగా ఏ ప్రభుత్వ నుంచి సైతం ఎటువంటి సాయమూ లేదు."-బోట్ల రత్నాకర్, వెల్లంపల్లి

పదిహేనేళ్లుగా సర్కార్​ సాయమేలేదు : తన తండ్రి మరణంతో తల్లి వద్దే జీవనాన్ని కొనసాగిస్తున్న రత్నాకర్ తల్లిపై, తన సోదరులపై ఆధారపడకుండా కుటుంబ భారాన్ని మోస్తున్నాడు ఈ దివ్యాంగుడు. అయితే గత 15 సంవత్సరాలుగా ఈ మూడు చక్రాల బండిని నడుపుతూ జీవనోపాధి పొందుతున్నానని, ఇప్పటివరకు తనకు ఏ ప్రభుత్వము నుంచి ఎలాంటి సహాయం అందలేదని వాపోతున్నాడు.

రోజు ఇంటింటికి తిరుగుతూ పేపర్లు వేస్తూ అవసరాల నిమిత్తం పరకాలకు వెళ్లి రావాలంటే 12 కిలోమీటర్లు, బండిని చేతితో నడపాల్సి వస్తుందని, తద్వారా చేతి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు రత్నాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా స్పందించి రత్నాకర్‌కు మూడు చక్రాల మోటార్ సైకిల్‌ (స్కూటీ) ఇప్పిస్తే రోజువారి జీవన శైలిలో కొంత ఉపశమనం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మాతృమూర్తి మమకారం - దివ్యాంగ కుమారుడి భవిష్యత్తుకు శ్రీకారం

18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.