ETV Bharat / state

మేకప్‌ వీడియోలతో ఇంత క్రేజా! - డిజిటల్‌ స్టార్​గా మారిన తెలంగాణ యువతికి ఫోర్బ్స్​లో చోటు

మేకప్‌ వీడియోలతో ఫోర్బ్స్‌ జాబితాలోకి తెలంగాణ యువతి - వందమంది ఫోర్బ్స్‌ ‘డిజిటల్‌ స్టార్స్‌'లో 86వ స్థానంలో చోటు - బ్యూటీ, ఫ్యాషన్‌ విభాగంలో రాణిస్తోన్న ఆమె ఏమన్నారంటే ?

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

TELANGANA WOMAN IN FORBES
Young Woman From Telangana Selected in Digital Stars Forbes (ETV Bharat)

Young Woman From Telangana Selected in Digital Stars Forbes : భిన్నంగా ప్రయత్నించాలనే తపన, వీక్షకుల అభిరుచి పసిగట్టగల నేర్పు వంటివి ఉంటే చాలు సోషల్​ మీడియాలో కంటెంట్‌ క్రియేటర్‌గా మారిపోవచ్చు. పేరుతోపాటు డబ్బులు సైతం సంపాదించొచ్చు. అలాంటి వందమందినే ఫోర్బ్స్‌ 'డిజిటల్‌ స్టార్స్‌'గా చేసింది. వారిలో తెలంగాణకు చెందిన కొమ్మిరెల్లి ఆకాంక్ష ఒకరు. ఫ్యాషన్‌, బ్యూటీ విభాగంలో రాణిస్తోన్న ఆమె, ఇంతకి ఏం చెప్పారంటే. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదని, మనం దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే చాలని అంటున్నారు కొమ్మిరెల్లి ఆకాంక్ష. గుర్తింపు అదే వస్తుందని తన నమ్మకం అని చెబుతున్నారు.

నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లికి దగ్గర్లోని యడవెల్లి తన స్వస్థలం. తల్లిదండ్రులు అనంతరెడ్డి, మమత. ముగ్గురు కూతుళ్ల సంతానం. తండ్రి రియల్‌ఎస్టేట్, ఆటోమొబైల్‌ రంగంలో పని చేస్తుండగా తల్లి గృహిణి. తన తల్లిదండ్రులు తమను బాగా చదివించి స్థిరపడేలా చేయాలని పాతికేళ్ల క్రితమే హైదరాబాద్‌ వలసొచ్చామని చెబుతున్నారు. ఇక్కడే ఇంటర్‌ వరకూ చదివారని, పుణెలోని సింబయాసిస్‌లో బీటెక్‌ చేశానని తెలిపారు. చదువయ్యాక ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని అయినా తనకు మాత్రం రొటీన్‌గా ఉండే ఉద్యోగాలు కాకుండా కొంచెం భిన్నంగా ఉండాలని ప్రయత్నించాలనిపించేదని కొమ్మిరెల్లి ఆకాంక్ష అంటున్నారు. 2019లో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో వీడియోలు చేయడం ఆరంభించినట్లు తెలిపారు.

ఆరునెలల్లో 200లోపే ఫాలోవర్లు : ఆ సమయంలోనే కొన్ని విదేశీ బ్యూటీవ్లాగ్స్‌ తనను ఆకర్షించాయని, మనదగ్గర అలాంటివేమైనా ఉన్నాయేమో చూస్తే ఇతర భాషల్లో కొన్ని కనిపించాయని చెబుతున్నారు కొమ్మిరెల్లి ఆకాంక్ష. ఈ క్రమంలో తెలుగులో మేకప్‌ టిప్స్, ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్‌ వంటి విషయాలు చెబుతూ పలు వీడియోలు అప్​లోడ్​ చేసేవారని తెలిపారు. మొదట ఆరునెలల్లో యూట్యూబ్‌, ఇన్‌స్టా రెండింటికీ కలిపి 200 మందిని మించి ఫాలోవర్లు లేరని పేర్కొన్నారు. ఉన్నవాళ్లు కూడా తన స్నేహితులు, బంధువులేనని అన్నారు. వీడియోలకీ పెద్దగా ఆదరణా దక్కలేదని, అయినా తానేం నిరాశపడలేదని వెల్లడించారు. నెమ్మదిగా వ్యూయర్‌షిప్‌ను పెంచుకునే టెక్నిక్స్‌ తెలుసుకున్నారని, వీక్షకులకు నచ్చే కంటెంట్‌ను పెంచిన చెప్పారు.

మరో రెండు నెలలకు దాదాపు 30 వేల ఫాలోవర్లు పెరిగారని, సంఖ్య రెండింట్లోనూ మూడులక్షలకు పైగానే ఉందని కొమ్మిరెల్లి ఆకాంక్ష అన్నారు. తాను చేసే వీడియోలకు వ్యూయర్‌షిప్‌ పెరగడంతో అమెజాన్, లారియల్‌, మింత్రా వంటి ఫ్యాషన్, బ్యూటీ పరిశ్రమలు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు సైతం తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగానూ నియమించుకున్నాయని తెలిపారు. మరికొన్ని వాణిజ్య సంస్థలతోనూ కొలాబరేషన్‌ వీడియోలూ చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలో గార్నియర్‌ బ్రాండ్‌ కోసం బిల్‌బోర్డ్‌లోనూ కనిపించానని చెప్పారు. ఇలా ప్రకటనలు, ప్రచారాలతో ఉద్యోగం చేసి సంపాదించిన దానికంటే ఎక్కువే అందుకుంటున్నానని అంటున్నారు.

హీరోయిన్లతోనూ పని చేశా : అంతేకాకుండా హీరోయిన్లతోనూ పని చేసినట్లు కొమ్మిరెల్లి ఆకాంక్ష పేర్కొన్నారు. అయితే తానేం చేస్తోందో అని తన అమ్మానాన్నలకు తెలియదని, ఆ తరువాత తెలిసినా కాదనకుండా ప్రోత్సహించారని తెలిపారు. తన అనుభవాల్ని పంచుకునే అవకాశం టెడెక్స్‌ ఇచ్చిందని, ఆ వీడియో చూసి ఎంతోమంది అమ్మాయిలు మీ నుంచి స్ఫూర్తి పొందాం అని అంటుంటే గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఫోర్బ్స్‌ డిజిటల్‌ స్టార్‌ జాబితాలో తాను 86వ స్థానంతో చోటు దక్కించుకోవడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందని పేర్కొన్నారు. స్పందన ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేస్తారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.