ETV Bharat / state

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి జాబితా ఆ రోజే విడుదల - వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం - INDIRAMMA HOUSE FIRST PHASE

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ మొదటి విడతలో అర్హులైన వారిని గుర్తించేందుకు కసరత్తు - 18న అర్హుల జాబితా రూపకల్పన - ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శన

Indiramma House First Phase Filtration
Indiramma House First Phase Filtration (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2025, 7:59 AM IST

Indiramma House First Phase Filtration : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారందరి ఇళ్లకు సర్వేయర్లు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్​లో నమోదు చేసుకున్నారు. ఈ యాప్​ ద్వారా ప్రతి దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలిస్తారు. యాప్​ సర్వేలు అర్హులేనని తేలినప్పుటికీ సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు వెల్లడైతే ఆ దరఖాస్తును పక్కన పెట్టేస్తారు. మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైనా వారికే ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఉన్న ఇతర వివరాలతోనూ పూర్తిస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. పూర్తి వడపోత తర్వాత ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఈ నెల 21 నుంచి ఏర్పాటు చేసే గ్రామసభల్లో ఈ జాబితాను ప్రదర్శించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. కాగా ఈ నెల 26లోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది.

గ్రామసభల్లో ప్రదర్శన : ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు, పట్టమాలు వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు కసర్తతు చేస్తున్నారు. మొత్తం 3,500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్​ఛార్జి మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదిస్తారు. ఆనంతరం ఎన్ని మంజూరయ్యాయో ఆ వివరాలు గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. ఎంపికలో అతిపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తారు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో గురువారం వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్​ సర్వే 97శాతం పూర్తయింది. 32 జిల్లాల్లో 69,83,895 దరఖాస్తులు ఉండగా 68,08,923 దరఖాస్తులను సర్వే చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో 100శాతం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో 99 శాతం, మహబూబ్​నగర్​, మహబూబాబాద్​, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, నాగర్​కర్నూల్​, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 98శాతం సర్వే పూర్తయింది. మిగతా జిల్లాల్లోనూ 100శాతం పూర్తి చేసి ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు.

ఇందిరమ్మ ఇళ్లు - ఈ కొలతల్లో కడితే రూ.5 లక్షలకు రూపాయి దాటదు!

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ - హైదరాబాద్​లో వారికే తొలి ప్రాధాన్యం : మంత్రి పొన్నం

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు - అనర్హుల నుంచే భారీగా దరఖాస్తులు - అయోమయంలో అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.