Indian Navy Milan 2024 Exercises at Visakha: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మిలాన్ 2024 విన్యాసాలు విశాఖలో జరుగుతున్నాయి. ఫుల్ డ్రస్ రిహార్సల్స్ విశాఖ ఆర్కే బీచ్‌లో సందడిగా సాగాయి. నౌకాదళానికి చెందిన 60కి పైగా హెలీకాప్టర్‌లు, అత్యాధునిక యుద్ద విమానాలు గగన తలంలో చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. సిటీ పరేడ్‌లో వివిధ దేశాల బృందాలు కవాతు నిర్వహించాయి. గురువారం జరిగే పూర్తి స్థాయి విన్యాసాలకు సర్వం సిద్ధమైంది. భారత నౌకదళ పాఠవాన్ని ఇక్కడి సదుపాయాలను ఇతర నేవీలకు పరిచయం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించారు.
దౌత్య పాత్రలో భారత్ ముందడుగు: సీజీఎస్ విక్టరీ నౌక మారిషష్‌కు అందజేత
Milan 2024 Mega Naval Exercise: విశాఖ ఆర్కే బీచ్‌లో మిలాన్ 2024 ఫుల్ డ్రస్ రిహార్సల్స్, ఎయిర్ పవర్ డిమాన్ స్ట్రేషన్‌లు కొనసాగుతున్నాయి. వివిధ నేవీ బృందాల మధ్య సమావేశాల తర్వాత సిటీ పరేడ్ కోసం ఆర్కే బీచ్‌లో ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. ఎయిర్ పవర్ డిమాన్ స్ట్రేషన్ కింద గగన తలంలో 60కి పైగా యుద్ద విమానాలు, జెట్ ఫైటర్లు, వివిధ రకాలకు చెందిన హెలీకాప్టర్లు చేసిన విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. నావికుల సాహసాలు గగుర్పాటుకు గురి చేశాయి. తేజస్ యుద్ధ విమానాల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
విశాఖలో అట్టహాసంగా మిలన్ 2024 - అబ్బురపరుస్తోన్న విన్యాసాలు
Laser Show in RK Beach: ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో భాగంగా పలు దేశాల నేవీ బృందాలు తమ దేశ జాతీయ పతాకాలతో ప్రదర్శన నిర్వహించాయి. సీకేడెట్లు చేసిన నృత్యాలు, నేవీ బ్యాండు అందరిని అలరించాయి. కవాతులో భాగంగా శ్రీలంక నేవీ బ్యాండు బృందం చేసిన వాద్యం, నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిగ్ 29 విమానాలు సందడి చేయగా చేతక్, సీకింగ్, పీఐ8 హెలికాప్టర్లు అద్భుత ప్రదర్శనలు చేశాయి. సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు మూడు వేర్వేరు విధానాలుగా హెలికాప్టర్, నౌకా దళ సిబ్బంది రిహార్సల్స్ చేశారు. అంతర్జాతీయ సిటీ పరేడ్‌లో భాగంగా పలు దేశాల నేవీ బృందాల ప్రదర్శన విశాఖలో కొనసాగుతోంది. వివిధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. లేజర్ షో అందరినీ అకట్టుకుంది.
సాగర తీరంలో సందడిగా మిలన్ 2024 - అబ్బురపరుస్తున్న నేవీ విన్యాసాలు
విమానాలు గాలిలో రయ్ మంటూ దూసుకెళ్తూ, హెలికాప్టర్లు గగనంలో చక్కర్లు కొట్టాయి. సైనికులు శత్రువులను తుదముట్టిస్తూ ముందుకు సాగారు. ఇలా తీరంలో యుద్ధ వాతావరణమే కనిపించింది. మిలాన్ 2024 సందర్భంగా మంగళవారం బీచ్ రోడ్డు, సముద్ర తీరంలో నావికదళ విన్యాసాలు ఔరా అనిపించాయి. పలు దేశాల నావికా సిబ్బంది పరేడ్ నిర్వహించారు. సాధారణ ప్రజలను తీరంలోకి అనుమతించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.
విశాఖ వేదికగా 'నేవీ మిలన్-2024'- నౌకాదళ ఉత్సవాల్లో పాల్గొనున్న 50 దేశాలు