ETV Bharat / state

విదేశీ జైళ్ల నుంచి భారతీయుల విముక్తి ఎప్పుడు? - అందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషేంటి? - విదేశీ జైళ్లలో భారతీయులు

Indians In Foreign Prisons : ఆర్థిక అవసరాలు మనుషులను ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. అందుకోసం కన్నవాళ్లను కట్టుకున్న వారిని పిల్లలను పుట్టిన ఊరుని వదిలి వెళ్తారు. అలా పని చేస్తూ ఒక పూట తిని మరో పూట పస్తులు ఉంటూ సంపాదించిన కొంతమెుత్తాన్ని ఇంటికి పంపుతూ జీవనం సాగిస్తున్నారు. కానీ, తెలిసో తెలియకో చేస్తున్న కొన్ని తప్పుల వల్ల కొందరు జైలు పాలైతే ఏజెంట్ల మోసాల కారణంగా మరికొందరు బలవుతున్నారు. ముఖ్యంగా అక్కడి చట్టాలు, వీసా నిబంధనలు తెలియకుండా జైళ్లలో చిక్కుకున్నవారే ఎక్కువమంది ఉన్నారని అంచనా. ప్రపంచంలోని 89 దేశాల్లో భారత్‌కు చెందిన 9వేల521 మంది అక్కడి జైళ్లలో మగ్గుతున్నట్లు పార్లమెంటులో కేంద్రం వెల్లడించింది. ఇంతకీ విదేశీ జైళ్లలో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఎంటి? వారిని స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి అవరోధాలు ఉన్నాయి.? అందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషేంటి.? ఇప్పుడు చూద్దాం.

Indians In Foreign Prisons
Indians Prisoners Lodged In Foreign Jails
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 2:49 PM IST

విదేశీ జైళ్ల నుంచి భారతీయుల విముక్తి ఎప్పుడు - అందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషేంటి?

Indians In Foreign Prisons : జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి యూఏఈలో అక్రమంగా సరిహద్దు దాటుతూ పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. సారంగాపూర్‌ మండలం లచ్చక్కపేటకు చెందిన ఇద్దరు అమాయకులను రాయికల్‌ మండలానికి చెందిన ఓ ఏజెంట్‌ మాయమాటలు చెప్పి హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌ విమానం ఎక్కించాడు. అక్కడి నుంచి మలేసియాకు రోడ్డు మార్గం ద్వారా కొంత దూరం, మరికొంత నడక మార్గం ద్వారా చేర్చారు.

మలేసియాలో ఉపాధి కోసం బస్సు ఎక్కుతున్న అభాగ్యులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మేడిపల్లి మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య రియాద్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మల్యాలకు చెందిన రాజయ్య అనే మరో వ్యక్తి జైల్లో శిక్ష అనుభవిస్తూ మృతి చెందగా కనీసం మృతదేహం కూడా ఇల్లు చేరలేదు. ఆయన డెత్‌ సర్టిఫికెట్‌ మాత్రమే పంపడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ టీవీల్లో వింటూ పేపర్లలో చూస్తునే ఉన్నాం.

ఉపాధి కోసం ఊరు వదిలిన అభాగ్యుల్లో చాలా మంది తెలిసో తెలియకో చేసిన తప్పులకు కటకటాల పాలవుతున్నారు. విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి వివరాలు కావాలంటూ ఇటీవల కొందరు ఎంపీలు పార్లమెంటులో అడగగా విదేశాంగ శాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోని 89 దేశాల్లో 9వేల521 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారని వెల్లడించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా గల్ఫ్‌ దేశాల జైళ్లలో ఉన్నట్లు వివరించారు. అత్యధికంగా సౌదీ అరేబియాలో 2,200, దుబాయ్‌లో 2,143, నేపాల్‌లో 1,227, ఖతర్‌లో 752, యూకేలో 278, అమెరికాలో 170, పాకిస్థాన్‌లో 308 మంది భారతీయ పౌరులు విదేశీ కారాగారాల్లో మగ్గుతున్నారు.

చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి

Indian Prisoners in Foreign Countries : జైళ్లలో ఉన్న ఖైదీలను టీఎస్‌పీ అగ్రిమెంట్‌ ద్వారా బదిలీ చేయడానికి పలు దేశాలతో భారత్‌ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు కొంత మేర ఊరట లభిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో బంగ్లాదేశ్, ఇరాన్, కజకిస్తాన్, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్, యూకే వంటి చాలా దేశాలు ఉన్నాయి. 2006 నుంచి 2022 జనవరి వరకు టీఎస్‌పీ అగ్రిమెంట్‌ కింద కేవలం 86 మంది మాత్రమే విదేశాల నుంచి భారత్‌కు వచ్చారు. భారత్‌ నుంచి 11 మంది విదేశీ ఖైదీలను ఆయా దేశాలకు పంపారు.

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే ఉద్యోగులుగా స్థిరపడగా, చాలా మంది కార్మికులుగా పని చేస్తన్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన 5గురు దుబాయిలో ఓ హత్యకేసులో ఇరుక్కుని 18 సంవత్సరాల పాటు శిక్షను అనుభించారు. ఇందులో నలుగురు ఇటీవలే స్వదేశానికి చేరుకున్నారు.

ఉద్యోగానికి రావట్లేదని జైలుకు పంపిన కంపెనీ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన జాకీర్ కుమారుడు ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసం అబుదాబికి వెళ్లాడు. కొన్నాళ్ల పాటు ఓ సంస్థలో ఉద్యోగం ఆ తర్వాత రిజైన్ చేశాడు. సదరు కంపెనీ అతని రిజైన్‌ని సమ్మతించపోగా ఉద్యోగానికి రావడంలేదని కేసు పెట్టి జైలుకు పంపించింది. దీంతో గత 5 ఏళ్లుగా జాకీర్‌ కుమారుడు అబుదాబి కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నాడు. నేషనల్ సెక్యూరిటీ కారణం చూపుతూ జైల్లోనే ఉంచిన తన కూమారుడిని స్వదేశానికి తీసుకరావాలని జాకీర్‌ కోరుతున్నాడు.

జైళ్లలో మగ్గుతున్న వారికి యునైటెడ్‌ అరబ్‌ మర్చంట్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చంట్ అండగా నిలుస్తున్నారు. సుమారు 2.5 కోట్ల రూపాయలు చెల్లించి యూఏఈ వ్యాప్తంగా 900 మంది ఖైదీలకు విముక్తి కల్పించారు. స్వదేశాలకు వెళ్లాలనుకునేవారికి ప్రయాణ టికెట్లను సమకూర్చారు. 2024లో 3 వేల మంది ఖైదీలను విడుదల చేయించాలని ఫిరోజ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Navy Officers Released From Qatar : ఇటీవల ఖతర్ నుంచి 8 మంది మాజీ నేవీ అధికారుల విడుదలకు చొరవ చూపిన మాదిరిగానే ఇతర భారతీయ ఖైదీలను విడిపించాలని బాధితుల కుటుంబీకులు కోరుతున్నారు. భారతీయులను విడిపించడానికి దౌత్య కార్యాలయాలు సమర్థవంతంగా కృషి చేయాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాలకు వెళ్లేటప్పుడే ఆయా దేశాలకు సంబంధించిన చట్టాలు, నియమాల పట్ల అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై అమ్మనాన్నల కలను నిజం చేసిన సూర్యాపేట యువకుడు

4 ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసిపట్టిన వరంగల్​ కుర్రాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.