ETV Bharat / state

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొర్రా జయకేతనం - తొలి ప్రాధాన్యంలోనే తేలిన ఫలితం! - GOPIMURTHY WON MLC BY ELECTION

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం

Independent candidate Borra Gopimurthy won Teachers MLC by election
Independent candidate Borra Gopimurthy won Teachers MLC by election (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 6:50 PM IST

Independent candidate Borra Gopimurthy won Teachers MLC by election : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై బొర్రా గెలుపొందారు. అయితే ఈ గెలుపును కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాకినాడ JNTUలో నిర్వహించిన ఈ ఓట్ల లెక్కింపులో బొర్రా గోపీమూర్తి తొలి నుంచే (Borra Gopimurthy) ఆధిక్యంలో కొనసాగారు. చివరికి లెక్కింపు పూర్తయ్యాక 9,165 మొదటి ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బొర్రా గోపిమూర్తిని పీడీఎఫ్‌ బలపరిచింది. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తం 15,494 ఓట్లకు 14,680 పోలయ్యాయి. ఈ ఓట్లలో 814 చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు.

సంబరాల్లో మునిగిన వర్గీయులు : ఈ నెల 5న నిర్వహించిన పోలింగ్ లో 15,495 ఉపాధ్యాయుల ఓట్లు నమోదవ్వగా, బొర్రా గోపీ మూర్తికి 9,163 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. గోపీ మూర్తి గెలుపును ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉభయగోదావరి జిల్లా ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ గత ఏడాది రహదారి ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. గంధం నారాయణరావు, దీపక్ పులుగు, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపీమూర్తి స్వతంత్ర్య అభ్యర్థులుగా బరిలో నిలిచారు. లెక్కింపు ప్రారంభం నుంచే గోపీమూర్తి ముందజలో ఉన్నారు. ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠాలు చెప్పుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలని చెప్పారు. దివంగత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి విజయం అంకితమని గోపీమూర్తి అన్నారు.

"గెలుపు పెద్ద కష్టమేమీ కాదు"- హుందా రాజకీయాలు చేద్దామన్న సీఎం చంద్రబాబు

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గోదావరి జిల్లాల్లోని 113 మండలాల్లో మొత్తం 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉప ఎన్నికలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరిగాయి.

హైకోర్టు తీర్పు - విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - వైఎస్సార్సీపీ క్యాంప్​ రాజకీయం - Jagan Meeting Paderu YSRCP Leaders

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.