ETV Bharat / state

పల్లెలో పర్షియన్ మార్జాలాలు - జంతు ప్రేమికులను కట్టిపడేస్తున్న విదేశీ పిల్లులు - Persian Cats Breeds in Yellandu - PERSIAN CATS BREEDS IN YELLANDU

Impressing Persian Cats Breeds in Yellandu : పిల్లి ఎదురుపడితే అపశకునం అనే కాలం నుంచి పెంపుడు జంతువుగా చేరదీసే రోజులుగా మారింది. పెట్​ యానిమల్స్​​ అంటే పిల్లులు కూడా ఉంటాయనేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పర్షియన్​ మార్జాలాలు సందడి చేస్తున్నాయి. ఆ ఇంట్లో వారిని వాటి అల్లరితో కట్టిపడేస్తున్నాయి. ఇతరులు సైతం పిల్లులను పెంచుకునేలా ఈ పర్షియన్​ మార్జాలాలు ఆకట్టుకుంటున్నాయి.

Demand on Persian Cats Breed
Impressing Persian Cats Breeds in Yellandu
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 5:10 PM IST

Impressing Persian Cats Breeds in Yellandu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పట్టణంతో పాటు పల్లెల్లో పర్షియన్ జాతికి చెందిన పిల్లులను జంతు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా పెంచుకుంటున్నారు. స్థానికంగా ఉండే ఫక్రుద్దీన్ హైదరాబాద్​లో మూడేళ్ల క్రితం రూ.8 వేలతో పర్షియన్ జాతికి చెందిన రెండు పిల్లులను కొనుగోలు చేసి పెంచుకుంటున్నారు. సాధారణంగా అరబ్ దేశాల్లో కనిపించే ఈ మార్జాలాలు ఇప్పుడు మన వద్ద, పలు ప్రాంతాల్లోని నివాస గృహాల్లో, పెంపుడు జంతువుల్లో ఒకటిగా మారాయి.

ఎలుకల జోలికి వెళ్లవు : గుండ్రని ముఖం, చిన్న మూతి, ఒళ్లంతా వెంట్రుకలు, ఆకట్టుకునే కళ్లతో కనిపించే ఈ పిల్లులు పుట్టిన మూడు నెలల తర్వాత పాలు తాగవు. ఎలుకల జోలికి వెళ్లవు. ఫక్రుద్దీన్ కుమారులు ఆక్రం, ఫిరోజ్​లో వీటి పెంపకం విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. ప్రతినెలా రూ.5-6 వేల వరకు వెచ్చించి ప్రత్యేక ఆహార పదార్థాలను వీటికి అందిస్తున్నారు. తొలుత తీసుకొచ్చిన వాటి ద్వారా వృద్ధిలోకి వచ్చిన సంతానాన్ని రెండుమూడు సార్లు విక్రయించారు. పర్షియన్ ఆడపిల్లి సాధారణంగా ఒక ఈతలో రెండు నుంచి ఐదు పిల్లలను పెడుతుంది.

Demand on Persian Cats Breed : మార్కెట్​లో జంతు ప్రేమికులు ఒక్కోదాన్ని రూ.3 వేల నుంచి గరిష్ఠంగా రూ.10 వేల వరకు వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారు. తెల్ల పిల్లులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఇల్లెందు పట్టణంలో నాలుగైదు కుటుంబాలు ఈ రకం పిల్లులను పెంచుతుండటం విశేషం. ఇప్పుడు వేసవి కాలం నేపథ్యంలో మనుషులు వినియోగించుకునే క్యాప్స్​ను వీటికి అమరుస్తూ తమ జంతు ప్రేమను చాటుతున్నారు. పిల్లి కనబడగానే అపశకునం అని భావించే కాలం నుంచి పెంపుడు పిల్లి కనపడకపోతే కలవరపాటుకు గురయ్యే పరిస్థితులు ఈ జంతు ప్రేమికులకు కలుగుతుంది.

ఎక్కువగా శునకాలు మాత్రమే జంతు ప్రేమికులు ఇష్టపడుతుంటే ఇప్పుడు పిల్లులు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. కొత్తగూడెంలో తన మిత్రుడు ఇంటికి వెళ్లినప్పుడు పర్షియన్ పిల్లి కూనను చూశానని, తనకు ఆసక్తిగా అనిపించడంతో తీసుకొచ్చానని జంతు ప్రేమికుడు గోపి తెలిపారు. అప్పటినుంచి వీటిని పెంచడం వల్ల మనసు ప్రశాంతంగా ఉందని చెప్పారు.

'మొదట ఈ పిల్లులను కొత్తగూడెంలో మా ఫ్రెండ్ ఇంట్లో చూశా. దాన్ని చూడగానే మంచిగా అనిపించింది. వెంటనే మా ఫ్రెండ్​ను అడిగి పిల్లిని ఇంటికి తీసుకొచ్చా. వాటిని తీసుకొచ్చినప్పటి నుంచి ప్రశాంతత దొరికింది. అందుకే వీటిని ప్రేమగా పెంచుకుంటున్నా.'- గోపి, జంతు ప్రేమికుడు ​

పల్లెలో పర్షియన్ మార్జాలాలు - జంతు ప్రేమికులను కట్టిపడేస్తున్న విదేశీ పిల్లులు

పెటెక్స్​ ఎక్స్​పోలో పిల్లుల అందాల పోటీలు.. తరలివచ్చిన నగరవాసులు

వీధి శునకాలను అక్కున చేర్చుకున్న యువకుడు - మిత్రులతో కలిసి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.