ETV Bharat / state

వీళ్లు సామాన్యులు కాదు - మనుషుల్లేకుండానే మద్యం అక్రమ రవాణా - Liquor smuggling In AP - LIQUOR SMUGGLING IN AP

Illegal Transportation Of Liquor In AP : ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులలో మద్యాన్ని అక్రమంగా రవాణా చేయడం చూసి ఉంటాం. కానీ ఇలా రవాణా చేసినప్పుడు నిందితులు పట్టుబడేవారు. దీంతో మద్యం అక్రమ రవాణా చేసేందుకు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఎవరూ పట్టుబడకుండా కేవలం మద్యాన్ని మాత్రమే రవాణా చేస్తున్నారు. ఇది ఎలా అంటారా? ఇప్పుడు తెలుసుకుందాం.

Illegal Transportation Of Liquor In AP
Illegal Transportation Of Liquor In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 4:10 PM IST

Illegal Transportation Of Liquor In AP : ఏపీలో మద్యం అక్రమ రవాణా కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్రమార్కులు నిత్యం కొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు. గతంలో బైక్​ల ద్వారా మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా రవాణా చేసేవారు. ఆ తర్వాత కార్లు, బస్సుల్లో సైతం వేర్వేరు చోట్ల పెట్టి, మూటల్లో కట్టి తరలించేవారు. అయితే తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు నిందితులు పట్టుబడేవారు. దీంతో తాము పట్టుబడకుండా ఉండేందుకు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు తాజాగా మనుషుల్లేకుండానే మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అది కూడా ట్రైన్​లో చేస్తుండడం గమనార్హం.

మద్యం అక్రమ రవాణా : మద్యం అక్రమ రవాణా చేసే గ్రూపులోని సభ్యుడు మద్యం సీసాలు అట్టపెట్టెల్లో పెట్టుకుని ట్రైన్​లో ఏదో ఒక బోగీలోని ఓ బెర్తు కింద వాటిని పెడతాడు. అనంతరం అదే స్టేషన్​లో ఆ వ్యక్తి దిగిపోతాడు. అయితే ఈ విషయాన్ని సదరు బెర్తులో ప్రయాణించేవారు రైలులో వెళ్లేవారు ఎవరో పెట్టుకున్నారని మిన్నకుండిపోతారు. దీంతో సరకు ఎక్కడకు పంపాలనుకున్నారో ఆ స్టేషన్‌ వచ్చేసరికి అదే ముఠాకు చెందిన మరో వ్యక్తి రైలులో ఆ బోగీ వద్దకు వచ్చి మద్యం సీసాలతో ఉన్న అట్టపెట్టెను తీసుకెళ్లిపోతాడు. ఈ విధంగా మనుషుల్లేకుండానే మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతున్న తంతు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎక్కడ జరిగిందంటే: గుంటూరులో శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సోమవారం సాయంత్రం మద్యం సీసాలను గుర్తించి రైల్వే రక్షక దళానికి సమాచారం అందజేశారు. సికింద్రాబాద్‌ నుంచి త్రివేండ్రం వెళ్తున్న ఈ ట్రైన్ (17230) స్లీపర్‌ బోగీలోని బెర్తు కింద ఓ అట్టపెట్టె ఉన్నట్లు ప్రయాణికుడు సమాచారం ఇచ్చారు. దీంతో సదరు ప్రయాణికుడు ఇచ్చిన సమాచారం మేరకు టీటీఐ చక్రధర్‌ దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్రైన్ గుంటూరు చేరుకున్న అనంతరం చీఫ్‌ టికెట్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, ఆర్‌పీఎఫ్‌ సభ్యుల సమక్షంలో పెట్టెను తెరవగా, అందులో ఏడు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు.

దీనిపై ఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో బెర్తు కింద పెట్టిన మద్యం సీసాల అట్టపెట్టెను, గుంటూరులో తీసుకునేలా ఏర్పాట్లు జరిగినట్లు రైల్వే రక్షక దళం అధికారులు అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందుకున్న వ్యక్తి గుంటూరులో ఆ మద్యాన్ని ట్రైన్ నుంచి తీసుకునేలా చూస్తున్నారని భావిస్తున్నారు. ఈ విధంగా మద్యాన్ని అక్రమంగా రవాణా చేసి చేసుకుంటున్నట్లుగా రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నరో వారిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

ఆబ్కారీ ఆదాయంపై సర్కార్ స్పెషల్ ఫోకస్ - అక్రమ మద్యంపై ఉక్కుపాదం - TG GOVT FOCUS ON EXCISE REVENUE

గోవా నుంచి మద్యం ఎలా తేవాలో చూపించాడు - కటకటాల పాలయ్యాడు - Liquor Smuggled From Goa

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.