ETV Bharat / state

గోవా నుంచి ఏపీకి నాసిరకం మద్యం - ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ఆటలు - Illegal Goa Liquor in AP - ILLEGAL GOA LIQUOR IN AP

Goa Liquor in Andhra Pradesh: అడ్డదారుల్లో గెలుపు కోసం అధికార పార్టీ నేతల మద్యాన్ని తమ మార్గంగా ఎంచుకున్నారు. గోవాలో నాసిరకం సరకు తయారుచేయించి, ఆంధ్రప్రదేశ్‌కు రప్పిస్తున్నారు. దీన్ని తాగితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. మూడు రాష్ట్రాలు దాటి నాసిరకం మద్యం రాష్ట్రానికి ఎలా వస్తుంది అనే దానిపై అధికారులు విచారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Ysrcp Illegal Liquor Distribution
Goa Liquor Scam in Andhra Pradesh
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 4:29 PM IST

Goa Liquor in Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అడ్డదారుల్లో గెలిచేందుకు ‘మద్య’ మార్గం పట్టిన కొందరు నాయకులు భారీ కుట్రకు తెరతీశారు. ప్రతి నియోజకవర్గంలో ఉండే లక్షల మంది ఓటర్లకు మద్యాన్ని పంపిణీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే గోవాలో మద్యం అక్రమంగా తయారు చేసే డిస్టిలరీల్లో తక్కువ ఖర్చుతో నకిలీ మద్యాన్ని తయారు చేయిస్తున్నారు.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్​లో క్వార్టర్‌ మద్యం సీసా కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకూ ఖర్చవుతుంది. అదే గోవాలో నకిలీ మద్యం తయారు చేయిస్తే క్వార్టర్‌కు రూ.20 నుంచి రూ.30 వెచ్చిస్తే చాలు. దీంతో అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేయించి వాటిని సీసాల్లో నింపి, అసలైనదేనని నమ్మించేలా నకిలీ లేబుళ్లు, హాలోగ్రామ్‌లు అతికించి, వాటికి సీల్ వేయిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు.

గోవాలో తయారు చేస్తున్న మద్యం అత్యంత నాసిరకమైనది. దీన్ని తాగితే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. అయితే కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం పోయేది ప్రజలే కదా! మనకేం నష్టం అన్నట్లుగా ప్రజల ప్రాణాల్నే పణంగా పెడుతున్నారు. నకిలీ, హానికరమైన మద్యాన్ని రాష్ట్రాలు దాటించి తీసుకొస్తుంటే పోలీసులు, సెబ్‌ అధికారులు మొద్దునిద్ర పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జగన్​ సభ నిండుగుండాలంటే మందు ఫుల్లుగుండాలా!- 20 లక్షల బాటిళ్లు- మద్యం వ్యాపారం అంటే ఇదే! - Liquor in jagan Campaign 2024

మూడు రాష్ట్రాలు దాటి ఎలా వస్తుందో ?: ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు వారి రహస్య స్థావరాలు, డంప్‌ల్లో నిల్వ చేసిన మద్యంలో ప్రస్తుతం పట్టుకున్నది, పట్టుబడింది కనీసం ఒక్క శాతమైనా ఉండదు. వందల కోట్ల విలువైన మద్యాన్ని వారు ఇప్పటికే నిల్వ చేసుకున్నారు. ఇంకా తెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గోవా మద్యం వారికి ఎలా చేరుతోంది? దాదాపు మూడు రాష్ట్రాలు, దారి పొడవునా పదుల సంఖ్యలో చెక్‌పోస్టులు దాటి మరీ రాష్ట్రంలోకి మద్యం ఎలా వస్తోంది? ఎక్కడా తనిఖీల్లో ఎందుకు పట్టుకోలేదు?

YSRCP Secrete Goa LIquor : సరకు వైఎస్సార్సీపీ నాయకులదని వదిలేశారా? లేకుంటే అడ్డుకోవద్దని పెద్దల ఆదేశాలతో ప్రత్యేకంగా ఆ మద్యం తీసుకొచ్చే వాహనాలను ఎవరూ ఆపకుండా ‘గ్రీన్‌ ఛానల్‌’ ఏమైనా ఏర్పాటు చేశారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులతో మద్యం సరఫరా కాకుండా నిలువరించాలని, తెలంగాణ- ఆంధ్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం డిసెంబరు, జనవరి నెలల్లోనే ఆదేశించింది. వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారులు మొదట్లో తనిఖీ కేంద్రాలే ఏర్పాటు చేయలేదు. తర్వాత పెట్టినా మొక్కుబడి తనిఖీలే.

మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​ - జంట నగరాల్లో ఆ రోజు వైన్సులు బంద్ - Liquor Stores Close in Hyderabad

ఆయనకు నోటీసులిచ్చి ఎందుకు విచారించట్లేదు?: ఊరూరా వైఎస్సార్సీపీ నాయకులు మద్యం నిల్వ చేసినా, సెబ్‌, పోలీసు అధికారులు, తనిఖీ బృందాల వారికి సమాచారం, ఫిర్యాదులు అందితేనే దాడులు చేస్తున్నాయి. కేసు పెట్టేసి మమ అనిపించేస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన్ను ఓడించాలని అధికార వైఎస్సార్సీపీ తొక్కని అడ్డదారులు లేవు. తాజాగా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లల్లోనే 48 వేల 720 మద్యం సీసాలు పట్టుబడినా సూత్రధారులెవరో పోలీసులు తేల్చట్లేదు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే గోవా మద్యం ఆంధ్రప్రదేశ్​లోకి తీసుకొచ్చి, ఓటర్లకు పంచుతున్నారని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి.

అలాంటప్పుడు ఆయనకు నోటీసులిచ్చి ఎందుకు విచారించట్లేదు? వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫున పంపిణీకే ఈ మద్యం నిల్వ చేసుకున్నప్పుడు వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై ఎందుకు కేసు నమోదు చేయట్లేదు? 2014 ఎన్నికల సమయంలోనూ వైఎస్సార్సీపీ నాయకులు గోవాలో నకిలీ మద్యం తయారు చేయించి, సీసాలపై నకిలీ లేబుళ్లు వేసి ఓటర్లకు పంచారు. ఆ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత సర్వేపల్లి, కావలి వైసీపీ అభ్యర్థులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అప్పట్లో కేసులు నమోదయ్యాయి.

లోక్​సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - ఇప్పటి వరకు రూ.155 కోట్లు సీజ్ - CASH SEIZED IN TELANGANA 2024

గోవా మద్యమంతా వైఎస్సార్సీపీ నాయకుల వద్దే : ఒక్క పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని నలుగురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీ చేస్తే 48 వేల 720 సీసాల మద్యం పట్టుబడింది. ఇదంతా గోవా సరకే. విలువ రూ.80 లక్షల పైమాటే. నందిగామ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్‌రావు నామినేషన్‌ సందర్భంగా దాదాపు 20 వేలకు పైగా క్వార్టర్‌ సీసాలను పంపిణీ చేశారు. ఇవన్నీ గోవా బ్రాండ్లే.

కోనసీమ జిల్లా ఆలమూరులో మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు సీహెచ్‌ ప్రభాకర్‌రావుకు చెందిన ఇటుకల బట్టీలో పట్టుబడిన 6 వేల 240 మద్యం సీసాలూ గోవా నుంచి తెచ్చినవే. ఇప్పటి వరకూ పట్టుబడ్డ గోవా మద్యమంతా వైఎస్సార్సీపీ నాయకుల వద్దే దొరికింది. అందువల్లే పోలీసులు, సెబ్‌ అధికారులు వాటి గుట్టు తేల్చే దిశగా దర్యాప్తుపై దృష్టి సారించట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - kavitha Judicial Custody Extended

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.