Illegal Telephone Exchange Bustesd in Hyderabad : టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఉన్న సమాచారంతో టెలికాం శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌లోని పూల్‌బాగ్‌లో నివసిస్తున్న హిదాయత్ అలీ ఇంటిపై దాడి చేశారు. అతనితో పాటు బోరబండకు చెందిన మరో వ్యక్తి కూడా ఈ నేరంలో పాలుపంచుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు ముజాహెద్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. వారిని విచారించే క్రమంలో అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మారుస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో టెలికాం శాఖకు నష్టాలు కలిగించారని పోలీసు అధికారులు తెలిపారు.
'లోపాలను పసిగట్టి.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు'
Two Arrested In Illegal International Telephone Exchange : హిదాయత్‌అలీ సంతోష్‌నగర్ ఠాణా పరిధిలోని ఫూల్‌బాగ్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్‌లు, సిమ్ బాక్స్, బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌లతో అక్రమంగా అంతర్జాతీయ ఎక్స్‌ఛేంజ్ (Telephone Exchange Fraud in HYD) నడుపుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఈ క్రమంలోనే బాలాపూర్ మెట్రో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ 204లో ఖతార్, దుబాయ్, సౌదీ నుంచి వచ్చే కాల్స్‌ని చట్టవిరుద్ధంగా ఐఎల్‌డీ ఎక్స్‌ఛేంజీలకు అనుసంధానం చేస్తున్నారని చెప్పారు. తద్వారా భారతీయ పౌరులకు కనిపించే సీఎల్‌ఐ (కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్) భారతదేశం మొబైల్ నెంబరు ద్వారానే కాల్ వచ్చినట్లుగా ఉంటుందని వివరించారు. హిదాయత్‌అలీ తనకు తోడుగా ముజాహెద్ అహ్మద్‌ను ఈ నేరంలో భాగస్వామిని చేశాడని రష్మి పెరుమాళ్ వివరించారు.
"ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. విదేశాల నుంచి తెచ్చిన పరికరాలతో కాల్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఫలితంగా టెలికాం శాఖకు నష్టాలు కలిగించారు. నిందితుల నుంచి 3 ఇంటర్నెట్ కనెక్షన్‌లు, 32 స్లాట్ సిమ్‌బాక్స్‌లు పది, 16 స్లాట్ సిమ్‌బాక్స్‌లు రెండు సహా పలు సాంకేతిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాం." - రష్మి పెరుమాళ్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ
నిందితులు కాల్ డైవర్షన్ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా దేశ భద్రతకు సైతం ముప్పు కలిగించే చర్యలు చేయడం ఆందోళనకరమని పోలీసులు తెలిపారు. వారి నుంచి 3 ఇంటర్నెట్ కనెక్షన్‌లు, 32 స్లాట్ సిమ్‌బాక్స్‌లు పది, 16 స్లాట్ సిమ్‌బాక్స్‌లు, 03 రూటర్లు, 06 ల్యాప్‌టాప్‌లు, 02 హార్డ్‌డిస్క్‌లు, 08 చరవాణులు, 204 బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డులు, 04 మానిటర్లు, 10 పవర్ కేబుళ్లు, 50 ఆర్‌జే కేబుళ్లు, 03 ఇన్వర్టర్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 204 సిమ్‌కార్డుల్లో అత్యధికంగా 177 సిమ్‌కార్డులు పశ్చిమ బంగా నుంచి తీసుకువచ్చినట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు జాకీర్ హుస్సేన్, టాస్క్‌ఫోర్స్(అడ్మిన్) ఇన్‌స్పెక్టర్ కె.శ్రీకాంత్, ఎస్సైలు జి.ఆంజనేయులు, కె.నర్సింహులు, ఎన్.నవీన్ పాల్గొన్నారు.
అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి.. రూ.లక్షల్లో సంపాదన.. ముఠా అరెస్ట్!
ఐఎస్డీ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చుతున్న కేంద్రంపై దాడి