IIT Madras Online Certificate Course 2024 : 8 వారాల పాటు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల కోసం దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రసిద్ధిగాంచిన ఐఐటీ-మద్రాస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే. 8 వారాల పాటు ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులు సాగనున్నాయి. ఒక్కో కోర్సుకు రూ.500 మాత్రమే నామమాత్రపు రుసుము తీసుకోనున్నారు. డేటా సైన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అధునాతన కోర్సులను బోధించనున్నారు. ఈ అవకాశం కేవలం ఐఐటీ-మద్రాసుకు భాగస్వామిగా నమోదు చేసుకున్న పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. ఈ సదావకాశం కోసం ఆయా స్కూళ్లకు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించాలి. ఇలా సంప్రదించడం ద్వారా ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల గురించి 10 కీలక అంశాలు :
- ఐఐటీ మద్రాస్‌లో ఇప్పటివరకు 450 పాఠశాలలు భాగస్వామం కాగా, 11 వేల మంది విద్యార్థులకు పైగా పలు బ్యాచ్‌లలో వివిధ కోర్సులు నేర్చుకొని లబ్ధి పొందారు. ఈ విషయం స్వయంగా ఐఐటీ మద్రాసు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ ప్రయోగంతో భవిష్యత్తు తరాలను నిపుణులుగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని, విద్యార్థులు తమ అభిరుచులకు నప్పే కెరీర్ మార్గాన్ని ఎంచుకొనేందుకు ముందుగానే అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఐఐటీ-మద్రాస్ ప్రయత్నం ద్వారా గుర్తు చేసింది.
- ఐఐటీ మద్రాస్ భాగస్వామ్య పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అక్టోబరు నుంచి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు ప్రారంభం అవుతాయి. ఇందుకోసం సెప్టెంబరు 16 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 4 వరకు సాగుతుంది. భాగస్వామిగా చేరాలనుకునే పాఠశాలలకు సెప్టెంబరు 30 వరకు అవకాశం ఉంది. అక్టోబరు 21 నుంచి ఆన్‌లైన్ కోర్సుకు బ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
- ఈ దరఖాస్తుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులకు ఏ స్ట్రీమ్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థులైనా ఆఫ్లై చేసుకోవచ్చును.
- ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సుకు మాత్రం ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెట్లుగా ఉన్నవాళ్లే అర్హులు.
- కోర్సులో భాగంగా నెలకు ఒకసారి శని/ఆదివారాల్లో లైవ్ ఇంటరాక్షన్ ఉండనుంది.
- 30 నిమిషాల నిడివితో రికార్డ్ చేసిన లెక్చర్ వీడియోలు ప్రతి సోమవారం విడుదల చేస్తారు. విద్యార్థులు ఒక వీక్‌లో ఎప్పుడైనా వీటిని వీక్షించే వీలుంది.
- అన్లైన్ అసైన్మెంట్లు రెండు వారాలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు అసైన్మెంట్లు ఉండనున్నాయి. వీటి సమర్పించేందుకు కూడా కొంత సమయం ఇస్తారు. అదే రెండు వారాలు గడువు.
- నిర్దేశిత గడువులోగా విద్యార్థులు కంటెంట్ వీడియోలను చూడాలి. వీటితో పాటు తమ అసైన్మెంట్లను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఒక్కో అసైన్‌మెంట్‌కు కనీసం 40 శాతం మార్కులు తప్పని సరి స్కోరు. తుది మూల్యాంకనం కోసం మొత్తం 4 అసైన్మెంట్లలో మూడింటిని తీసుకొని వాటిలో అత్యత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.
- ఆన్‌లైన్ కోర్సు పూర్తి అయిన ఎనిమిది వారాల తర్వాత పాసైన విద్యార్థులకు ఈ-సర్టిఫికెట్లను పంపిస్తారు. ఈ కోర్సు కెరియర్‌కు ఎంతగానో తోడ్పడుతుంది.