IIMR Global Centre Of Excellence Success In Hyderabad : ప్రాచీన, సంప్రదాయ చిరుధాన్యాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. జీవనశైలి వ్యాధులను దూరం చేసే గుణాలు, పౌష్టిక విలువలు ఉన్న దృష్ట్యా ఇటీవల కాలంలో చిరుధాన్యాల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. వరి, గోధుమ, పత్తి పంటలకు ప్రత్నామ్నాయంగా చిరుధాన్యాల పంటల సాగే శ్రేయస్కరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. ప్రధాని మోదీ(PM MODI) ప్రత్యేక చొరవతో 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన తర్వాత అనేక అవగాహన కార్యక్రమాలు జరగడంతో ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు ప్రాధాన్యత మరింత పెరిగింది. భారత్ తరహాలో అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం చిరుధాన్యాల వినియోగం మొదలైంది. దీంతో వారంతా భారత్ వైపే చూస్తున్నారు.
'దేశంలో ఆవిష్కరణలు కొత్తపుంతలు.. ఆ జాబితాలో ఐదో స్థానంలో భారత్'
Cereals Research Institute of India In Hyderabad : హైదరాబాద్ రాజేంద్రనగర్ వేదికగా ఏర్పాటైన ఐసీఏఆర్(ICAR) అనుబంధ భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ, తన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. ఈ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరుధాన్యాల రంగంలో సవాళ్లు అధిగమించేందుకు ఐసీఏఆర్ చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసిస్తూ శాస్త్రవేత్తలను అభినందించారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ 80 శాతం వాటా కలిగి ఉంది. చిరు ధాన్యాలలో పుష్కలమైన పోషక విలువలే ఉండటమే కాదు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
పోషకాల చిరుధాన్యాలు.. ఇలా చేసుకుంటే ఈజీగా తినేయొచ్చు
చిరుధాన్యాలలో పుష్కలమైన పోషక విలువలు : చిరుధాన్యాల సులభతర సాగు గురించి, భారతదేశం ఇతర దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉంది. చిరుధాన్యాలు మెట్ట ప్రాంతాల్లోనే కాదు ప్రతికూల వాతావరణంలోనూ పండుతాయి. ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో వీటిని పండిస్తారు. వీటన్నిటిని ‘శ్రీఅన్న' పేరిట ప్రపంచ దేశాల ముందుకు మనదేశం తీసుకువెళుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోధుమ, వరి పంటలతో బేరీజు చేసి చూస్తే చిరుధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు, మినరల్స్, కాల్షియం, ఐరెన్, విటమిన్‌లు వంటివన్నీ చిరుధాన్యాల్లోనే పుష్కలంగా లభిస్తాయి.
అందుకే మన పూర్వీకులు చిరుధాన్యాలను పండిస్తూ ఆరోగ్యాన్నీ సంరక్షించుకునేవారు. ఐఐఎంఆర్ పదో యేటలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా తాము పునరంకితం అవుతామని శాస్త్రవేత్తలు ప్రతినబూనారు. చిరుధాన్యాలను వినియోగించేవారు మధుమేహం, గుండె పోటు, రక్తపోటులకు గురికాకుండా ఉంటారు. కొలెస్ట్రాల్, స్థూలకాయం, జీర్ణకోశ వ్యాధులు దరి చేరవని పరిశోధనల్లో తేలింది.
Millets Boosts Children Growth : చిరుధాన్యాలతో చిన్నారులకు ఎంతో మేలు