IAS Institute Lecturer Marries Minor Girl in Hyderabad : చదువు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన గురువే ఓ మైనర్‌ను ప్రేమ వలలో దించి పెళ్లి చేసుకున్న ఘటన శంషాబాద్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ ప్రాంతానికి చెందిన సూర్యదీప్ అనే టీచర్ శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేరాడు. అదే కాలేజీలో చదువుతున్న ఓ మైనర్‌పై కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పి, కిడ్నాప్ చేసి నగరానికి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై ఆ బాలిక కుటుంబ సభ్యులు తమను ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. సూర్యదీప్ను అదుపులోకి తీసుకుని అతనిపై కిడ్నాప్‌తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక- కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే మృత శిశువు జననం
"బాలిక మిస్ అయ్యిందని ప్రిన్సిపల్ మాకు వచ్చి ఫిర్యాదు చేశారు. 14వ తేదీన మైనర్ మిస్ అయిందని మేము దర్యాప్తు చేశాము. సూర్యదీప్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా హిస్టరీ లెక్చరెర్‌గా ఈ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను బాలికతో లవ్ ఎఫైర్‌తో అమ్మాయిని తీసుకెళ్లి మ్యారేజీ చేసుకున్నాడు. దానికి సంబంధించి నిందితుడిని కూడా పట్టుకున్నాము. న్యాయ బద్ధంగా పోక్సో కేసు నమోదు చేశాం. అతన్ని కోర్టుకు పంపించి జైలుకి పంపించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఉంది ఇంకా ఏవైనా సమాచారం ఉంటే అందిస్తాము. మొదటగా కిడ్నాప్ కేసు నమోదు అయింది. అమ్మాయి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేశాం." - బాలరాజు, సీఐ
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా - మైనర్ బాలుడు సహా బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్
ఈ ఘటనను విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సూర్యదీప్ పనిచేస్తున్న ఇనిస్టిట్యూట్ ముందు బైఠాయించి బాలికకు న్యాయం చేయాలని కోరారు. ఆ ఇనిస్టిట్యూట్ గుర్తింపు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్టు చేశారు.
17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ - పరారీలో ముగ్గురు నిందితులు
"ఇక్కడ ఉన్న ఐఏఎస్ అకాడమీలో గురువులే ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్లి చదువుకోవాలి. మేము కోరుకుంటున్నది ఒక్కటే, ఈ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి. ఇక్కడ బ్రాంచ్‌ను తీసివేయాలి. కనీసం అర్హతలు లేని వారిని ఇక్కడికి తీసుకొచ్చి తక్కువ జీతాలు ఇచ్చి వారిని లెక్చరర్లుగా పెడుతున్నారు. సూర్యదీప్ అనే వ్యక్తి మైనర్ బాలికను ప్రేమించి నగరానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడం నేరం. అతన్ని కఠినంగా శిక్షించాలి. బాధిత బాలికక చదువుకు అయ్యే ఖర్చువారే ఇవ్వాలి." - ప్రదీప్, ఏబీవీపీ నాయకుడు
28 వెడ్స్ 14- పేరెంట్స్‌కు తెలియకుండా మ్యారేజ్, పుట్టింటికి పంపించనని వింత వాదన!