ETV Bharat / state

'హైడ్రా' పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలుకే - కమిషనర్ రంగనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ - HYDRA RANGANATH WARNING - HYDRA RANGANATH WARNING

Hydra Commissioner Warning : హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను చెరబట్టి వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అయితే కొందరు దీని పనితీరును తప్పుదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి హైడ్రా కమిషనర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి విషయాలు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

Hydra Commissioner Warning
Hydra Commissioner Warning (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 12:35 PM IST

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వారికి జైలు జీవితం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం విస్తృతంగా అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న క్రమంలో కొంతమంది వ్యక్తులు సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారని, హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఇలాంటి వారి చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో కలిసి దిగిన ఫొటోలను చూపిస్తా సమస్యలు రాకుండా చూస్తామని బహుళ అంతస్తులు, వ్యక్తిగత గృహాల్లో నివాసం ఉంటున్న వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందినట్లు రంగనాథ్ తెలిపారు. ఈ విషయంలో హైడ్రా మరింత కఠినంగా వ్యవహారిస్తుందని చెప్పారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోవపట్టించే విధంగా యత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

హైడ్రా దూకుడు- అమీన్​పూర్​లో అక్రమ కట్టడాల కూల్చివేత - Demolitions in Sangareddy

అలాగే ప్రభుత్వ విభాగాలైన రెవిన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం ఎవరైనా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని ఎస్పీ, సీపీకి లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో ఓ బిల్డర్ వద్ద బెదిరింపులకు పాల్పడ్డాడని, విచారణ జరిపి అతన్ని సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేసినట్లు రంగనాథ్ వెల్లిడంచారు.

సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. హైడ్రా విభాగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తప్పుదోపట్టించే విధంగా యత్నిస్తే కఠిన చర్యలుంటాయి. హైడ్రా పేరుతో డబ్బు కావాలని ఒత్తిడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లో, ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలున్నాయంటూ బెదిరిస్తున్నారు. అమీన్ పూర్ లో హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడిన విప్లవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. - రంగనాథ్, హైడ్రా కమిషనర్

అక్రమ నిర్మాణాలకు అనుమతులు - హైడ్రా సిఫార్సుతో ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు - HYDRA Action Against Officials

అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై హైడ్రా చర్యలు - త్వరలోనే మరింత మందిపై కేసులు! - Hydra Registered Cases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.