ETV Bharat / state

రాంనగర్‌లో ఆక్రమణలు పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ - Ranganath Visit To Musheerabad - RANGANATH VISIT TO MUSHEERABAD

Hydra Commissioner Ranganath Visit To Musheerabad : అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం వాటి వివరాలను, వాటికి సంబంధించిన స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.

Hydra Commissioner Ranganath
Hydra Commissioner Ranganath Visit To Musheerabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 10:10 PM IST

Hydra Commissioner Ranganath Visit To Ramnagar : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. మణెమ్మ గల్లీలో రోడ్డు ఇరుకుగా మారిందని నాలాలను, రోడ్డును ఆక్రమించారని ఆయనకు స్థానికులు తెలిపారు.

రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు : దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి వరద నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు మహిళలు ఆయనకు మొరపెట్టుకున్నారు. నాలా ఆక్రమణ, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు, సంబంధించిన స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశించారు.

మీర్​పేట్​లోని గొలుసుకట్టు చెరువుల పరిశీలన : మరోవైపు మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్​లో హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల అక్రమాలపై ఆరా తీశారు. ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను పరిశీలించారు. చెరువుల్లో ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్​లను పరిశీలించారు. మీర్​పేట్​లో మూడు చెరువులు, సంధ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు ఈ మూడు గొలుసుకట్టు చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.

అధికారులను చెరువుల ఆక్రలపై నివేదిక తయారు చేయాలని తెలిపారు. బాలాపూర్ ఎమ్మార్వో,ఆర్​ఐని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కబ్జాలో ఉన్నవారికి ఎవరికైనా నోటీసులు ఇచ్చారా అని ఆరా తీశారు. గతంలో కబ్జా చేసిన వాటిని ఎంత వరకు కూల్చారని వాటిపైన పూర్తిగా నివేదిక తయారు చేయాలని బాలాపూర్ ఎమ్మార్వోను ఆదేశించారు.

నీటివనరుల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి సారించిన హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పార్టీలకతీతంగా హైడ్రా పనితీరును ప్రశంసిస్తున్నారు. మరోవైపు హైడ్రాకు అధికార కాంగ్రెస్‌ నుంచి సైతం మద్దతు పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో హైడ్రాను బలోపేతం చేయాలని కోరుతున్నారు.

ఓఆర్‌ఆర్‌ ఆవలకూ హైడ్రా బుల్డోజర్లు! - విస్తరణ దిశగా సర్కార్​ అడుగులు - State Govt Plan To HYDRA Expansion

హైడ్రా నోటీసులు ఇవ్వదు - కూల్చడమే : కమిషనర్ రంగనాథ్ - Commissioner Ranganath On HYDRA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.