ETV Bharat / state

హైదరాబాద్ మాదాపూర్​లో ఉత్సాహంగా 'వేగాన్​ ఫెస్టివల్​ 2024' - Hyderabad Vegan Festival 2024

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Hyderabad Vegan Festival : ప్రకృతికి దగ్గరై ఆరోగ్యకర జీవన విధానం అలవరుచుకునేందుకు పర్యావరణం, ఆరోగ్యం ఒకదానికొకటి ఎలా సంబంధం ఉంటుందో తెలియజేయడానికి మాదాపూర్​లోని స్టేట్​ గ్యాలరీ ఆఫ్​ ఆర్ట్​లో హైదరాబాద్​ వేగాన్​ ఫెస్టివల్​ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని అమల హాజరయ్యారు. సెప్టెంబరు 27,28 తేదీలలో జరిగిన ఈ ఫెస్టివల్​లో 40 స్టాల్స్​ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తి ప్రకృతి సిద్ధమైన వస్తువులను, ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పిస్తున్నారు.

Hyderabad Vegan Festival
Hyderabad Vegan Festival (ETV Bharat)

Hyderabad Vegan Festival 2024 : ప్రకృతిని ప్రేమించే పర్యావరణ మిత్రులు మరో అడుగు ముందుకేసి శాఖాహారంలో కూడా కాస్త మార్పులు చేసి వేగాన్‌ను ప్రజలకు పరిచయం చేశారు. ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని దేశాల్లో ఈ వేగాన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేగాన్​ ఫుడ్​ ఫెస్టివల్స్​ పేరుతో స్టాల్స్​ను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్​లో స్టేట్​ ఆర్ట్​ గ్యాలరీలో సీపీఆర్​ ఎడ్యుకేషనల్​ ఎన్విరాన్​మెంటల్​ సెంటర్​ వేగాన్​ ఫెస్టివల్​ను నిర్వహిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవన శైలి కోసం ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

"రెండో ఏడాది ఈ ఫెస్టివల్​ జరుగుతుంది. వేగాన్స్​ అనేవి జంతువులు, ప్రకృతి వల్ల వస్తాయి. ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రకృతికే కాకుండా మనుషులకు కూడా మంచి జరుగుతుందని చాలా రీసెర్చ్​లు నిరూపించాయి. ప్రపంచంలో ఎంతో మంది ఈ లైఫ్​ స్టైల్​ను లీడ్​ చేస్తున్నారు. చాలా మంది ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఆనందంగా ఉంటున్నారు. మొక్కలు తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది." - శ్రీదేవి, న్యూట్రిషనిస్ట్​ కార్యక్రమ నిర్వాహకురాలు

వేగాన్​ ఒక ఆరోగ్య రహస్యం : వేగాన్​ అనేది ఒక ఆరోగ్య రహస్యమని, ఇది ప్రకృతిలోని ప్రతి జీవితో సంబంధం కలిగి ఉంటుందని సినీ నటి అక్కినేని అమల అన్నారు. తాను 18 ఏళ్లుగా వేగాన్​ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రస్తుత కాలంలో వేగాన్స్​ సంఖ్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. వేగాన్​ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానమని, ప్రతి ఒక్కరూ దానిని పాటిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారమవుతామని ఐటీ పరిశ్రమల ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​ అన్నారు. ప్రకృతి సిద్ధంగా ఆహారం, వస్తువులు తయారు చేసే వారికి కూడా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.

"వేగాన్​ అనేది ఒక ఆరోగ్య రహస్యం. ఇది ప్రకృతిలోని ప్రతి జీవితో సంబంధం కలిగి ఉంటుంది. నేను 18 ఏళ్లుగా వేగాన్​ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాను. ప్రస్తుత కాలంలో వేగాన్స్​ సంఖ్య పెరుగుతుంది. వేగాన్​ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం. ప్రతి ఒక్కరూ దానిని పాటిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారిమి అవుతాం." - అక్కినేని అమల, సినీ నటి

పర్యావరణానికి, ఆరోగ్యానికి పరస్పర సంబంధం : పర్యావరణానికి, ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉంటుందని ఇలాంటి వేగాన్​ ఫెస్టివల్స్​ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు ఎంతో ఉపయోగపడతాయని విక్రయదారులు చెబుతున్నారు. ప్రకృతి ఇచ్చే వనరులతో వస్తువులను తయారు చేయడం వల్ల తిరిగి ప్రకృతికి నష్టం చేసిన వారిమి అవ్వమని చెబుతున్నారు. పూర్తిగా మొక్కల ద్వారా వచ్చిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఇటు పర్యావరణంతో పాటు జంతువులకు, మనుషుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వేగాన్స్​ అంటున్నారు.

Greenery in Singareni Coal mines area : బొగ్గుగనుల్లో పచ్చదనం.. పర్యావరణ సమతౌల్యానికి చెట్ల పెంపకం

పర్యావరణ రక్షణకు పదో తరగతి విద్యార్థిని ముందడుగు.. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.