ETV Bharat / state

ప్రయాణికులను కన్​ఫ్యూజ్​ చేస్తున్న హైదరాబాద్ హనుమకొండ హైవే - పొరపాటున జంక్షన్​ మిస్​ అయిందా 10 కి.మీ. తిరగాల్సిందే - Ministers review on wgl NH

Hyderabad to Hanamkonda NH Problems : హైదరాబాద్ హనుమకొండ జాతీయ రహదారి ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తుంది. కరుణాపురం ఫ్లై ఓవర్ వద్ద ఓరుగల్లు స్వాగత తోరణాన్ని కూడా రెండుగా చీల్చడంతో హనుమకొండ వరంగల్ జిల్లా కేంద్రాలకు వెళ్లే వాహనదారులు ఎక్కడి నుంచి పోవాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. దీంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్​గా మారింది. వరంగల్​ వెళ్లేందుకు జంక్షన్ పాయింట్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Warangal National Highway Problems
Hyderabad to Hanamkonda NH Problems
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 3:49 PM IST

Updated : Jan 28, 2024, 4:43 PM IST

ప్రయాణికులను కన్​ఫ్యూజ్​ చేస్తున్న హైదరాబాద్ హనుమకొండ హైవే

Hyderabad to Hanamkonda NH Problems : హైదరాబాద్ - హనుమకొండ జాతీయ రహదారి నిర్మాణ లోపాలు వాహనదారులను గందరగోళానికి గురు చేస్తున్నాయి. ఈ రహదారి హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు విస్తరించి ఉంది. కానీ రూట్ మ్యాప్ సరిగా లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడమే కాకుండా హనుమకొండ జిల్లా కేంద్రానికి వెళ్లే వాహనదారులకు ఈ రోడ్డు అర్థంకాక 10 కిలోమీటర్ల మేర ప్రయాణించి తిరిగి వెనక్కి వస్తున్నారు.

Hanamkonda Bus Stand : ఏంటీ..? ఇది బస్టాండా.. చెరువు అనుకున్నానే..?

Warangal National Highway Problems : హనుమకొండ హైదరాబాద్ జాతీయ రహదారి(Hyderabad National Highway)పై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. వరంగల్ చారిత్రక నగరం కావడంతో పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ ఈ జాతీయ రహదారి నిర్మాణం చేసినప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం కరుణాపురం ఫ్లై ఓవర్ వద్ద ప్రయాణికుల కోసం గత సర్కారు హయాంలో అండర్ బైపాస్ రోడ్డును ఏర్పాటు చేసింది. స్వాగత తోరణాన్ని కూడా రెండుగా చీల్చారు. దీంతో కరుణాపురం వద్దకు చేరుకున్న తర్వాత ప్రయాణికులకు, పర్యాటకులకు రోడ్డు అర్థంకాక ఆరేపల్లి వరకు వెళ్లి తిరిగి వెనక్కి వస్తున్నారు.

Hyderabad Road Problems : దయనీయంగా మారిన భాగ్యనగర రోడ్లు.. వాహనదారుల ఇక్కట్లు

Road Problems in Warangal : ఈ మార్గంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. మార్గం సరిగా లేదని, దీని ద్వారా ఎంతో ఖ్యాతి ఉన్న ఓరుగల్లుకు పోయేందుకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం లోపాలను గుర్తించి కరుణాపురం వద్ద జంక్షన్ పాయింట్ నిర్మాణం చేయాలని విన్నవించుకుంటున్నారు. ఇటీవల వరంగల్‌ పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), కొండా సురేఖ సీతక్కలతో కలిసి ఈ రోడ్డును పరిశీలించారు.

"హైదరాబాద్​ నుంచి వరంగల్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితమైన రూట్​ మ్యాప్​ లేదు. దీంతో జంక్షన్​ మిస్​ అవుతున్నాం. హైవే కారణంగా స్పీడ్​గా వాహనాలు వెళ్తున్నాయి. వరంగల్​ వెళ్లే వారు రూట్ మార్చాలి అనేలా ఏం ఏర్పాటు చేయలేదు. రోడ్డు ప్రమాదాలు చాలా జరిగాయి. కొత్తవారు కచ్చితంగా మార్గాన్ని మర్చివెళ్లిపోతున్నారు."- స్థానికుడు

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు - ట్రాఫిక్​తో ఇబ్బంది పడుతున్న ప్రజలు

Ministers Review on Hanamkonda High Way Works : రోడ్డు మార్గం లోపాలను సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కరుణాపురం వద్ద జంక్షన్ నిర్మాణం, స్వాగత తోరణం, రింగ్ రోడ్డు బ్రిడ్జి(Ring Road Bridge in Warangal) మీదుగా హైదరాబాద్- హనుమకొండ జాతీయ రహదారికి అనుసంధానంగా ఫ్లైఓవర్ నిర్మాణం అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కరుణాపురం జంక్షన్ ఆధునీకరణలో భాగంగా, జాతీయ ఉన్నత రహదారుల విభాగం వేర్వేరుగా రూపొందించిన మాస్టర్ ప్లాన్లను పరిశీలించారు. కరుణాపురాన్ని కేంద్రంగా చేసుకుని వంతెన, దాని సమీపంలో మరో రహదారి నిర్మాణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.

Kodichchera Village Road Problem in Kamareddy : 5 కిలోమీటర్ల రహదారి.. ఆ దారిలో వెళ్లాలంటే 500 గుంతలు దాటాలి

Last Updated : Jan 28, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.