Hyderabad Student Missing in America For last Two Weeks : అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ మహమ్మద్(Abdul Mohammed)అనే విద్యార్థి ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్‌ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని అబ్దుల్ తండ్రి మహమ్మద్ సలీం చెప్పారు. వారు 1,200 డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, లేనిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని బెదిరించినట్లు చెప్పారు. తాము దానికి అంగీకరించి అబ్దుల్ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపమని అడిగామని పేర్కొన్నారు.
Indian Student Missing in America : దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్ పెట్టేశారని, మళ్లీ కాల్ చేయలేదని తెలిపారు. కానీ కిడ్నాపర్ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఏడుపు వినిపించిందని చెప్పారు. ఈ నెంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపించామని, దానిని క్లేవ్‌ల్యాండ్ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు తెలిపారు. అబ్దుల్ మహమ్మద్ అదృశ్యమైన విషయంపై అతడి బంధువులు ఈ నెల 8న క్లేవ్‌ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఒక లుకౌట్ నోటీసు జారీ చేశారు.
మరోవైపు అతడి కుటుంబసభ్యులు మార్చి 18వ తేదీన చికాగోలోని భారత దౌత్య కార్యాలయాన్ని(Embassy of India) సంప్రదించి, తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విద్యార్థి తల్లి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన కుమారుడితో చివరిసారిగా ఈ నెల 7వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు.
![Indian Student Missing in America](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-03-2024/21030548_16x9_us.jpeg)
Indian Students Missing Cases in Abroad : ఈ ఏడాది అమెరికాలోని చికాగోలో హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై కూడా గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయం విదితమే. ఆ విద్యార్థి ఇండియానా వెస్లయన్ విశ్వవిద్యాలయంలో(Indiana Wesleyan University)చదువుతున్నాడు. అక్కడి భారత దౌత్య కార్యాలయం ఆ విద్యార్థికి అవసరమైన సాయం చేసింది.
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి- కారణం అదేనా!
శ్రీ చైతన్యలో విద్యార్థుల మధ్య ఘర్షణ - రాడ్లతో దాడి, ముగ్గురికి తీవ్ర గాయాలు