ETV Bharat / state

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి - అసలేం జరిగింది? - HYDERABAD STUDENT DIEd IN US - HYDERABAD STUDENT DIED IN US

Hyderabad Student Died In America : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. గత నెల 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన మహ్మద్ అబ్దుల్ ఆర్ఫాత్(25) యూఎస్‌లోని క్లేవ్‌ల్యాండ్‌ నగరంలో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.

Indian Student Missing in America
Hyderabad Student Dies in America
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 1:47 PM IST

Hyderabad Student Died In America : అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం క్లేవ్‌ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ (25) మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ఎక్స్‌లో తెలిపింది. తాము గత కొంత కాలంగా వెతుకుతున్న మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ ఓహైయోలోని క్లేవ్‌ల్యాండ్‌లో మరణించాడని ట్వీట్ చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేస్తామని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు.

Indian Student Missing In America : హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అబ్దుల్‌ తండ్రి మహమ్మద్‌ సలీం గతంలో చెప్పారు. వారు 1,200 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని, లేనిపక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని బెదిరించినట్లు చెప్పారు. దానికి ఒప్పుకున్న తాము అబ్దుల్‌ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు తెలపాలని అడిగినట్లు మీడియాకు వివరించారు.

హైదరాబాద్‌ విద్యార్థి రెండు వారాల నుంచి అమెరికాలో మిస్సింగ్ ​- కుటుంబానికి బెదిరింపు కాల్‌

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ : అయితే ప్రూఫ్ అడగడంతో కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్‌ పెట్టేశారని, మళ్లీ కాల్‌ చేయలేదని సలీం తెలిపారు. కానీ కిడ్నాపర్లు మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఏడుపు వినిపించిందని చెప్పారు. తమకు వచ్చిన ఫోన్ నెంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపించామని, వారు క్లేవ్‌ల్యాండ్‌ పోలీసులకు అందజేశారని వెల్లడించారు. అబ్దుల్‌ అదృశ్యమైన విషయంపై అతని బంధువులు ఈ నెల 8న క్లేవ్‌ల్యాండ్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థులు : మరోవైపు అతడి కుటుంబసభ్యులు మార్చి 18వ తేదీన చికాగోలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించి, తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక విద్యార్థి తల్లి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన కుమారుడితో చివరిసారిగా ఈ నెల 7వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు. అబ్దుల్ మరణంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య 11కు చేరింది.

కెనడాలో విషాదం - గుండెపోటుతో హైదరాబాద్​ విద్యార్థి మృతి

యూఎస్‌లో హైదరాబాద్‌ విద్యార్థిపై దాడి - సాయం చేయాలంటూ జైశంకర్‌కు అతడి భార్య లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.