Police Security For Bigg Boss-8 Grand Finale : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అభిమానులకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. గ్రాండ్ ఫినాలే షో జరిగే జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు అభిమానులు పెద్దఎత్తున రానున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బయట భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఇక్కడికి రావొద్దని పోలీసు తెలిపారు. గ్రాండ్ ఫినాలే కార్యక్రమం తరువాత ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ బందోబస్తు ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న బిగ్‌బాస్ నిర్వాహకులదే బాధ్యత అని పోలీసులు హెచ్చరించారు. గత సంవత్సరం డిసెంబరు 17న బిగ్‌బాస్-7 విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. అనంతరం ఆయన స్టూడియో బయటకు వచ్చాక అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. దీంతో ఈసారి పోలీసులు ముందస్తుగా బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారు.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే - ప్రైజ్‌మనీ రివీల్ చేసిన నాగార్జున - ఇంతవరకు ఇదే టాప్!
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే - స్టేజ్ మీద సందడి చేయనున్న సెలబ్రిటీలు వీరే!- లేటెస్ట్ ప్రోమో చూశారా?