ETV Bharat / state

స్నాప్​చాట్​లో డీలింగ్స్ - కోడ్​ భాషలో స్మగ్లింగ్ - నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు - Snapchat Drugs Case In Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 8:57 AM IST

Updated : Aug 15, 2024, 9:14 AM IST

Snapchat Drug Gang Busted in Hyderabad: బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ చేరవేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల నుంచి రూ.1 కోటి 10లక్షల విలువ చేసే 256 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఫ్రాంక్ అనే ప్రధాన నిందితుడి ద్వారా ఇద్దరు అన్నదమ్ములు కోడ్ భాషలో హైదరాబాద్‌లోని కస్టమర్లకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Snapchat Drug Gang Busted in Hyderabad
Snapchat Drug Gang Busted in Hyderabad (ETV Bharat)

Police Arrested Drug Gang In Hyderabad : హైదరాబాద్​కు డ్రగ్స్ చేరవేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నంచి రూ.1.10కోట్లు విలువ చేసే 256 గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్​కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నైజీరియా దేశానికి చెందిన ఒఫొజోర్ సండే ఎజికె అలియాస్ ఫ్రాంక్ 2016 లో స్పోర్ట్స్ వీసాపై భారత్‌కు వచ్చాడు. దిల్లీలోని స్టార్ ఆఫ్రికన్ స్పోర్ట్ క్లబ్‌లో చేరి రెండేళ్ల పాటు ఫుట్‌బాల్‌ ఆడాడు. 2018లో బెంగళూరుకి మకాం మార్చిన ఫ్రాంక్ వస్తున్న ఆదాయం సరిపోక అక్కడ మరో నైజీరియన్ ద్వారా డ్రగ్స్ మాఫియాలోకి దిగాడు. మధ్యప్రదేశ్‌కి చెందిన అనాస్ తన తండ్రి చనిపోవడంతో కుటుంబంతో సహా బెంగళూరులో ఉంటున్నాడు.

డ్రగ్స్​కు బానిసగా మారి : బెంగళూరుతో పాటు హైదరబాద్‌లో కార్ షిఫ్టింగ్ పని చేస్తున్న అనాస్ డ్రగ్స్‌కి బానిసగా మారాడు. ఇదే క్రమంలో కోల్‌కతాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అమె కూడా డ్రగ్స్‌కు బానిస అవ్వడంతో ఆమె ద్వారా అనాస్ ఖాన్‌కు ఫ్రాంక్ పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరూ కలిసి డ్రగ్స్ దందా ప్రారంభించారు. అనాస్ ఖాన్‌ ఫ్రాంక్ వద్ద తక్కువ ధరకు పలు రకాల డ్రగ్స్ కొని హైదరాబాద్‌లో వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించేవాడు. తన సోదరుడు సైఫ్‌ ఖాన్‌ ద్వారా వినియోగదారులకు డ్రగ్స్‌ డెలివరీ చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ సరఫరా కోసం స్నాప్​చాట్ : నిందితుడు అనాస్ ఖాన్ డ్రగ్స్ సరఫరా కోసం స్నాప్‌చాట్‌ని వాడుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు కోడ్ భాషలో స్నాప్ పెట్టి సంప్రదించిన వారికి సోదరుడు సైఫ్ ఖాన్ ద్వారా డెలివరీ చేయిస్తున్నాడు. ఇదే క్రమంలో బంజారాహిల్స్‌లోని సర్వీ కేఫ్ సమీపంలో డ్రగ్స్ డెలివరీ చేస్తున్న సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు సైఫ్‌ను పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో అనాస్ ఖాన్, ఫ్రాంక్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1కోటి 10లక్షల విలువ చేసే కొకైన్, ఎండిఎంఏ, ఎక్ట్సాసి పిల్స్, ఎల్‌ఎస్‌డి సహా ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామని హైదరాబాద్ సీపీ వెల్లడించారు.

డ్రగ్స్ కేసులో ఏపీకి చెందిన రావి మస్తాన్ అరెస్టు - ఫోన్​లో వందల న్యూడ్ వీడియోలు! - Mastan Sai Arrested in Drugs Case

డార్క్‌వెబ్‌లో డ్రగ్స్​ దందా - మూలాలను ఛేదించేందుకు దర్యాప్తు ముమ్మరం - Drugs Buying through Dark Web

Last Updated : Aug 15, 2024, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.