ETV Bharat / state

నిఘా నీడలో భాగ్యనగరం - చేతివాటం చూపించారో జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే! - mobile thieves in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 1:08 PM IST

Chain Snatchers in Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని అన్ని ఠాణా పరిధుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజుకు రోజుకు పెరుగుతున్న గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లు, దోపిడీ దొంగల భరతం పట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా యాంటీ స్నాచింగ్‌ టీమ్స్‌ ద్వారా 10 మంది సెల్‌పోన్‌ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

mobile snatchers in Hyderabad
mobile snatchers in Hyderabad (ETV Bharat)

Mobile Thieves in Hyderabad : హైదరాబాద్‌ మహానగరంలో రోజుకు రోజుకు పెరుగుతున్న గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లు, దోపిడీ దొంగల భరతం పట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏడు పోలీసు జోన్ల పరిధిలో డీసీసీ నుంచి హోంగార్డు స్థాయి వరకు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. వివిధ నేరాల్లో తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్తులపై నిఘా పెంచారు. స్థానిక పోలీసులు, యాంటీ స్నాచింగ్‌ టీమ్స్‌ నేరస్తుల కదలికలను గమనిస్తున్నారు. అనుమానితులు, ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. మూడ్రోజుల వ్యవధిలో సుమారు 150 కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలోని అన్ని ఠాణా పరిధుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చరవాణుల చోరీ కేసుల్లో అత్యంత కఠినంగా పోలీసులు వ్యవహారిస్తున్నారు. నగరంలో సగటున 30-40 మొబైల్‌ఫోన్లు మాయమవుతున్నట్టు పోలీసుల అంచనా. సిటీబస్సులు, మెట్రోరైళ్లు, ఆటోల్లో ప్రయాణికుల మధ్య చేరిన చిల్లర దొంగలు వీటిని కొట్టేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సమయాల్లో పాదచారులు, ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించే వారిని లక్ష్యం చేసుకొని ఆగడాలకు పాల్పడుతున్నారు.

మద్యం, గంజాయి మత్తులో స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దుండగులు, బాధితులు ఎదురుతిరిగితే హతమార్చేందుకు తెగిస్తున్నారు. విదేశీ ముఠాలు కూడా కొట్టేసిన ఫోన్లను కొనుగోలు చేయటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ ముఠాల ఆగడాలకు కళ్లెం వేసేందుకు సీపీ ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసింది. యాంటీ స్నాచింగ్‌ టీమ్స్‌ ద్వారా 10 మంది సెల్‌పోన్‌ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా సైదాబాద్, చిలకలగూడలో ఎదురుతిరిగిన స్నాచర్లపై పోలీసులు కాల్పులు జరిపారు.

ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ - సీసీటీవీలో దృశ్యాలు - Chain Snatching in Mangalagiri

నగరంలోని కొన్ని హోటళ్లు, ఐస్‌క్రీమ్‌పార్లరు, పాన్‌దుకాణాల నిర్వాహకులు సైతం నిబంధనలు పాటించడంలేదు. సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన సెల్‌స్నాచింగ్‌లు, హత్యలకు హోటళ్లు, మద్యం దుకాణాల వద్ద జరిగిన గొడవలే కారణాలుగా పోలీసులు నిర్ధారించారు. పహడీషరీఫ్, జల్‌పల్లి, కాటేదాన్, ఎల్బీనగర్‌ పరిసర ప్రాంతాలకు యువకులు, రౌడీషీటర్లు అర్ధరాత్రి దాటాక నగరంలోకి చేరుతున్నారు. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బహదూర్‌పుర, చార్మినార్, నాంపల్లి, గోషామహల్, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, టోలిచౌకి, అత్తాపూర్, సికింద్రాబాద్‌ తదితర చోట్ల హోటళ్లలో మకాం వేస్తున్నారు.

పోలీసు వాహనాల సైరన్లు విని హోటళ్లను మూసివేసినట్టు నిర్వాహకులు చేస్తున్నారు. పోలీసులు వెళ్లారని నిర్ధారించుకున్నాక యధావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టింది. నిర్దేశించిన సమయాన్ని మించి దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్న వారిపై ఛీటింగ్‌ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో తల్వార్లు, డాగర్ల వంటి పదునైన ఆయుధాలు ధరించి తిరుగుతున్న 10 మంది యువకులను పోలీసులు పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మార్కెట్​లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్​కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు - Traders Caught Mobile Thief

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.