ETV Bharat / state

నగర ప్రజలకు గుడ్​న్యూస్ - రేపు ఆ మార్గంలో మెట్రో వేళలు పొడిగింపు - చివరి రైలు ఎప్పుడంటే? - Hyderabad Metro Trains Time Extends - HYDERABAD METRO TRAINS TIME EXTENDS

Hyderabad Metro Trains Time Extends: నగర ప్రజలకు హైదరాబాద్​ మెట్రో శుభవార్త చెప్పింది. రేపు భాగ్యనగరం​లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ మార్గంలో మెట్రో వేళలు పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మరి, పొడిగించిన మెట్రో టైమింగ్స్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Hyderabad Metro
Ipl Match
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 1:17 PM IST

Hyderabad Metro Trains Time Extends : నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్(IPL 2024) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, మిగతా మార్గాలలో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయన్నారు. ఇంతకీ, ఉప్పల్ మార్గంలో పొడిగించిన మెట్రో వేళలు ఏ టైమ్​ నుంచి ఏ టైమ్​ వరకు అందుబాటులో ఉంటాయి? ఏ ఏ స్టేషన్​​లలో ప్రయాణికులు ఎక్కడానికి వీలుంటుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హైదరాబాద్ మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఉప్పల్ మార్గంలో ఏప్రిల్ 25 పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు. అంటే.. ఉప్పల్ మార్గంలో లాస్ట్​ ట్రైన్​ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.

అలాగే.. మిగతా మార్గాలలో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయన్నారు. అంటే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని చెప్పారు.

బస్సులు కూడా: మెట్రోతో పాటు.. క్రికెట్ అభిమానులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉప్పల్‌ స్టేడియం వరకు 60 బస్సులను అదనంగా నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సగానికిపైగా మ్యాచులు పూర్తి - ఎవరు టాప్​లో ఉన్నారంటే? - IPL 2024

ఇకపోతే.. ఏప్రిల్​ 25న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సీజన్​ 17లో భాగంగా జరిగే ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు ఏప్రిల్ 15న బెంగళూరులో జరిగిన మ్యాచ్​లో ఒకసారి ఆడాయి. అదే మ్యాచ్​లో.. హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 287 చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్​లో బెంగళూరు జట్టు గట్టిగానే పోరాడినప్పటికీ సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం వరించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 25న హైదరాబాద్​లోని ఉప్పల్ స్టేడియంలో రెండోసారి తలపడబోతున్నాయి. మరి, హోం గ్రౌండ్​లో జరిగే ఈ మ్యాచ్​లో హైదరాబాద్​ని మరోసారి విజయం వరిస్తుందా? లేదంటే బెంగళూరు విజయం సాధిస్తుందా? అనేది తెలియాలంటే మ్యాచ్ ముగిసేవరకు వెయిట్ చేయాల్సిందే!

జెట్ స్పీడ్​లో 'సన్​రైజర్స్'- ఇది 2.O వెర్షన్- కానీ అదొక్కటే లోటు! - Sunrisers Hyderabad IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.