ETV Bharat / state

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఖరారైన రూట్ మ్యాప్ - కొత్తగా 70 కి.మీ. మేర నిర్మాణ ప్రతిపాదనలు

Hyderabad Metro Phase 2 Route Map Expansion Finalized : హైదరాబాద్ మహానగరంలో మెట్రోరైలు సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఫేజ్ -2 మార్గాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫేజ్ -2లో 70 కిలోమీటర్ల మేర కొత్తగా మెట్రో అధికారులు రూట్ మ్యాప్​ను సిద్ధం చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Hyderabad Metro Phase 2 Finalized
Hyderabad Metro Phase 2 Route Map Expansion Finalized
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 9:28 PM IST

Updated : Jan 22, 2024, 10:26 PM IST

Hyderabad Metro Phase 2 Route Map Expansion Finalized : హైదరాబాద్​లో మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్​ను సిద్దం చేసిన మెట్రో అధికారులు, 70 కిలో మీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.

మెట్రో రెండో దశ కొత్త మార్గాలపై అధికారుల మేధోమథనం - చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ జంక్షన్!

హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాలకు అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రతిపాదిత మార్గాలను(New Proposed Routes) తయారుచేశారు. దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మెట్రో రైలు ప్రయాణం మరింత చేరువయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

Hyderabad Metro Services : నగరంలో హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులో ఉండి నిత్యం లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్(Jubilee Bus Station) నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్​ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. దాంతోపాటు మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు.

కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్ - 70 కి.మీ ప్రతిపాదనలు

క్రమ సంఖ్యకారిడార్ప్రారంభ మెట్రో స్టేషన్చివరి మెట్రో స్టేషన్మొత్తం దూరం(కిమీ)
012ఎంజీబీఎస్ఫలక్​నుమా5.5
02ఫలక్‌నుమాచాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ 1.5
034నాగోల్శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు29
04మైలార్‌దేవ్‌పల్లిరాజేంద్ర నగర్ వద్ద ప్రతిపాదిత హైకోర్టు4
055రాయదుర్గంఅమెరికన్ కాన్సులేట్ 8
066మియాపూర్పటాన్‌చెరు14
077ఎల్బీ నగర్ హయత్ నగర్8

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్​నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడిగించనున్నారు. అలాగే ఫలక్​నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ప్రతిపాదిత కారిడార్ 4 లో భాగంగా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కడ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Shamshabad Airport) వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రోమార్గాన్ని సిద్ధం చేయనున్నారు.

Hyderabad New Metro Route Map For Phase 2 : ఇక ఇదే కారిడార్​లో మైలార్ దేవ్​పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్​లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ సిద్దమైంది. కారిడార్ 5లో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్​గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (Financial District) వరకు 8 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది.

కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. కారిడార్ 7లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రోరైలు మార్గానికి రూట్ మ్యప్ సిద్దం చేశారు. కొత్తగా 70 కిలో మీటర్లు మేర సిద్ధం చేసిన రూట్ మ్యాప్ పై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Hyderabad Metro Record : 'మెట్రో' రైడ్ ఎంజాయ్ చేస్తున్న హైదరాబాదీలు.. 40 కోట్లు దాటిన ప్రయాణికులు

పెండింగ్​లో రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో, కొత్త మార్గాలపై సర్వేకు నిర్ణయం

Last Updated : Jan 22, 2024, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.