ETV Bharat / state

హైదరాబాద్​ మెట్రోరైలు ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పూ లేదు - Metro officilas Clarity On Timings

HYD Metro Clarity On Timings : హైదరాబాద్​ మెట్రోరైలు ప్రయాణ వేళల్లో మార్పుల విషయమై జరుగుతున్న ప్రచారాన్ని మెట్రోరైలు లిమిటెడ్​ అధికారులు ఖండించారు. మెట్రో ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మెట్రో రైళ్లు ఎప్పటిలానే 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

HYD Metro Clarity On Timings
HYD Metro Clarity On Timings (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 4:59 PM IST

Hyderabad Metro Clarity On Timings : మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ ఎల్అండ్​టీ మెట్రో రైలు లిమిటెడ్ అధికారులు ఖండించారు. మెట్రో ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పు చేర్పులు చేయలేదని, యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.

ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు మొదలవుతాయనేది ట్రయల్లో మాత్రమే చేశామని, ఇంకా ఆ వేళల్లో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఎల్అండ్ టీ వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులెవరూ మెట్రో రైళ్ల సమయాల్లో అయోమయానికి గురికావద్దని, యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని సూచించింది.

HYD Metro Trains Time Extends during Election : ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లే ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉండే విధంగా మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుండగా మే 14 వ తేదీన మాత్రం మెట్రోను ఉదయం 5 గంటల 30 నిమిషాలకే నడిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణీకుల సౌకర్యార్థమే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

ఐపీఎల్ మ్యాచ్ వేళ మెట్రో సమయం పొడిగింపు - ఈస్టేషన్లలో మాత్రమే అనుమతి - Hyderabad Metro timings extended

ఐపీఎల్​ మ్యాచ్​ సందర్భంగా ఓ రోజు మెట్రో సమయంలో మార్పు : కొద్ది రోజుల క్రితం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​ సందర్భంగా మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 25 న పొడిగించిన మెట్రో సేవలు అర్థరాత్రి 1 వరకు అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు గతంలో వెల్లడించారు. ఆ సమయంలో ఉప్పల్​ స్టేడియం వరకు మాత్రమే ప్రయాణికులకు అనుమతించారు. ఈ విధంగా తమ కస్టమర్లను సౌలభ్యం కోసం మెట్రోరైలు సమయానుకూలంగా కొన్నిసార్లు ప్రయాణ సమయాన్ని పొడిగిస్తుంది. ప్రత్యేకమైన సమయాల్లో తప్ప రోజువారీ సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదని ప్రయాణికులు దీనిని గుర్తించాలని మెట్రో అధికారులు తెలిపారు.

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - నేటి నుంచి మెట్రో రైలు వేళ‌లు పొడిగింపు - Hyderabad Metro Timings Extended

నగర ప్రజలకు గుడ్​న్యూస్ - రేపు ఆ మార్గంలో మెట్రో వేళలు పొడిగింపు - చివరి రైలు ఎప్పుడంటే? - Hyderabad Metro Trains Time Extends

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.