ETV Bharat / state

వ్యక్తిని ఇంటికి చేర్చిన 'ఆరేళ్ల కిందటి ఫొటో' - ఎంతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసుల - BANJARA HILLS POLICE ON MISSING MAN

అదృశ్యమైన వ్యక్తిని పట్టుకొన్న బంజారాహిల్స్‌ పోలీసులు - ఆరేళ్ల కిందటి ఛాయాచిత్రం, మొబైల్ కూడా లేదు - ఐనా చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

Hyderabad Man Missing Case
Hyderabad Man Missing Case Traced (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2024, 2:03 PM IST

Hyderabad Man Missing Case Traced : వంద రోజులు అదృశ్యమయ్యాడు. ఆరేళ్ల కిందటి ఛాయాచిత్రం మాత్రమే ఉంది. అతని దగ్గర ఎటువంటి మొబైల్ అందుబాటులో లేదు. అసలు సరైన ఆధారం ఏమీ లేవు. ఫిర్యాదు తీసుకొని బంజారాహిల్స్‌ పోలీసులు అదృశ్యమైన వ్యక్తి ఆచూకీని సాంకేతికత ఆధారంగా పట్టుకున్నారు. అతని కదలికలపై నిఘా పెట్టి సోమవారం అదుపులోకి తీసుకొన్నారు.

బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం : షౌకత్‌నగర్‌కి చెందిన షేక్‌ ఫిరోజ్‌(42) ఆరు సంవత్సరాల కిందట రాధికను పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దీంతో తన మకాంని నందినగర్‌కి మార్చాడు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. పెళ్లైన నాటి నుంచి తరచూ గొడవలు జరుగుతుండటంతో పెద్దలు చాలా సార్లు సర్ధిచెప్పేవారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్​కు వస్తే పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేవారు. భార్యతో గొడవలు పెరగడంతో ఫిరోజ్‌ సెప్టెంబరు 1న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భర్త వస్తాడని చూసినా తిరిగి రాకపోవడంతో సెప్టెంబరు 4న భార్య బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఫిరోజ్‌ ఫోన్​ అందుబాటులో లేదు.

పాత ఫోన్ నెంబర్ ట్రాకింగ్​తో : అతడి ఆరేళ్ల కిందటి ఛాయాచిత్రమే ఆమె వద్ద ఉంది. దీంతో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన బంజారాహిల్స్‌ ఎస్సై కోన రమేష్‌ నిందితుడి పాత ఫోన్ నెంబర్ ఆధారంగా అతడి స్నేహితుల వివరాలను తీసుకున్నారు. ఫిరోజ్‌ కొత్త ఫోన్​ను ఆదివారం ట్రాక్‌ చేసి అతను వైజాగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఆదివారం రాత్రి ఫిరోజ్‌ వైజాగ్‌ నుంచి సికింద్రాబాద్‌ వచ్చి మెట్రో రైలులో వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. యూసుఫ్‌గూడలో దిగి రహ్మత్‌నగర్‌ వైపు వెళ్తుండగా పీజేఆర్‌ విగ్రహం సమీపంలో ఫిరోజ్‌ ధూమపానం కోసం మాస్క్‌ తీశాడు. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అదృశ్య కేసులను పరిష్కరిస్తున్న తెలంగాణ మహిళా భద్రత విభాగం : ఏళ్ల తరబడి కనిపించకుండా అదృశ్యం అవుతున్న పలువురిని తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధీనంలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ మధ్య చాలాకాలంగా కనిపించకుండా పోయిన వారిని గుర్తించేందుకు ఏహెచ్​టీయూతో పాటు ఇదే విభాగంలోని షీ టీమ్స్​ కూడా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో 27 కేసులు కొలిక్కి వచ్చాయి. తెలంగాణలో 2024 నవంబరు నాటికి 22,870 అదృశ్యం కేసులు నమోదు అవ్వగా వాటిలో 19,191 కేసులు కొలిక్కి వచ్చాయి. కేసులు కొలిక్కి రావడంలో జాతీయ స్థాయి సగటును తెలంగాణ దాటేసింది.

'భోజనం తెచ్చేందుకు వెళ్లాడు - నా బిడ్డ వచ్చేస్తాడు' - రోడ్డువైపే చూస్తూ తల్లి ఎదురుచూపులు

ఇన్‌స్టాలో పరిచయం, ఫ్రెండ్​ రూమ్​లో వివాహం - ఆ తరువాత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.