ETV Bharat / state

భార్య జల్సాల కోసం దొంగగా మారిన భర్త - గోవా టూర్​కోసం చైన్ స్నాచింగ్! - HYDERABAD CHAIN SNATCHING CASES

Husband Chain Snatching for Wife : భార్య విలాసాలను తీర్చడం కోసం ఓ భర్త దొంగగా మారి పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఒక గ్రూప్​గా ఏర్పడి నగరంలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్​ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అంబర్ ​పేట్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. భార్య సరదాలు తీర్చడం కోసమే ఆ వ్యక్తి దొంగగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 7:35 PM IST

Husband Chain Snatching for Wife
Hyderabad Chain Snatching Incident (ETV Bharat)

Hyderabad Chain Snatching Incident : హైదరాబాద్‌ నగరంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అంబర్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు కొంతకాలంగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు తాము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావ్ వివరించారు.

అంబర్​పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంబర్ ​పేట్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఈనెల 19న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తుండగా, బైక్​పై వెనక నుంచి వచ్చి ఆమె మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. మహిళ ఫిర్యాదును స్వీకరించిన దర్యాప్తు మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్నంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్ అలియాస్​ బన్నీ(24)గా గుర్తించారు. బన్నీతోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు పోతం శెట్టి రవి, రాజేశ్​ రాఠోడ్‌లను కూడా అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ముగ్గురు వ్యక్తులు గతంలో కూడా ఇవే పనులు చేస్తూ దొరికిపోయారు.

'సెల్‌ఫోన్‌-చైన్‌' చోరులకు చెక్‌ - డెకాయ్‌ ఆపరేషన్లతో దొంగల భరతం పడుతున్న పోలీస్​ బృందాలు - Hyderabad Police Operation Decoy

ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత్​ కుమార్​కు ఈ మధ్యనే పెళ్లి అయింది. తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటోందని అందుకోసమే ఈ నేరానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇలా చోరీ చేయగా వచ్చిన డబ్బుతో గోవా టూర్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు నిందితుడు చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఈ గ్యాంగ్ తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురి నుంచి రెండు తులాల గోల్డ్ చైన్, ఒక బైక్, రెండు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గిరిధర్ రావ్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇటీవల చెలరేగుతున్న సెల్‌ఫోన్‌ - చైన్‌ చోరులకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పోలీస్​ యంత్రాంగం డెకాయ్ ఆపరేషన్​లను సైతం నిర్వహిస్తోంది. గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లు, అసాంఘిక శక్తులు, దోపిడీ దొంగలను కట్టడి చేసేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డెకాయ్‌ ఆపరేషన్ల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ఆయా టీమ్​లు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీ అధికం చేశారు. వారిని అదుపు చేసేందుకు అవసరమైతే కాల్పులకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాజధాని పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

మొన్న చెడ్డి గ్యాంగ్​, నిన్న ధార్ ముఠా, నేడు భవారియా బ్యాచ్ ​- హైదరాబాద్​ పోలీసులకు అంతర్రాష్ట్ర ముఠాల సవాల్‌ - Bawaria Chain Snatchers gang

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.