ETV Bharat / state

డంబెల్​ షేప్​లో 40సెంటీ మీటర్ల పొడవున్న కణితి - రిస్కీ సర్జరీ చేసి తొలగించిన వైద్యులు - dumbbell size tumor removal - DUMBBELL SIZE TUMOR REMOVAL

Dumbbell Shape Tumor Removed in AINU : డంబెల్​ ఆకారంలో ఉన్న 40సెంటీ మీటర్ల అరుదైన కణితిని తొలగించిన ఘనతను ఏఐఎన్​యూ డాక్టర్లు సొంతం చేసుకున్నారు. కిడ్నీ బాధ నుంచి విముక్తి పొంది అంతలోనే మరో వ్యాధితో ఇబ్బందితో పడుతున్న ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి డాక్టర్లు కాపాడారు.

Dumbbell Size Tumor Removed in AINU
AINU Doctors Removed Dumbbell Shaped Testis Tumor (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 1:55 PM IST

Updated : May 29, 2024, 2:03 PM IST

AINU Doctors Removed Dumbbell Shaped Testis Tumor : వృషణాల్లో డంబెల్​ ఆకారంలోని 40 సెంటీమీటర్ల అరుదైన కణితిని హైదరాబాద్ డాక్టర్లు విజవంతంగా తొలగించారు. క‌డ‌ప న‌గ‌రానికి చెందిన 39 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తికి ఏడాది క్రితం మూత్ర‌పిండాలు పూర్తిగా విఫ‌లం కావ‌డంతో కిడ్నీ మార్పిడి శ‌స్త్రచికిత్స చేశారు. అప్ప‌టినుంచి అత‌డు శ‌క్తిమంత‌మైన స్టెరాయిడ్లు, ఇమ్యునోస‌ప్రెసెంట్లు వాడుతున్నాడు.

ఇటీవ‌ల అత‌డికి ఎడ‌మ‌వైపు వృష‌ణం వాపు వ‌చ్చింది. దాన్ని సాధార‌ణ హైడ్రోసిల్ అని పొర‌ప‌డ్డాడు. అయితే వాపు క్ర‌మంగా పెరిగిపోతుండ‌టంతో స్థానిక వైద్యుల సూచన మేర‌కు హైదరాబాద్​లో ఉన్న ఏఐఎన్‌యూలో చూపించుకున్నాడు. అత‌డి ఎడ‌మ వృష‌ణం నుంచి బొడ్డు మీదుగా ఉద‌ర‌భాగం వ‌ర‌కు పెద్ద క‌ణితి ఉన్న‌ట్లు వైద్యులు గుర్తించారు.

13 నెలల చిన్నారి కడుపులో కిలోన్నర పిండం.. మూడు గంటలు శ్రమించి..

సాధారణ స్థాయి కంటే 20రేట్లు అధికం : 'అత‌డి బీటా హెచ్‌సీజీ స్థాయి అసాధార‌ణంగా పెరిగిపోయింది. ఇది సాధార‌ణ స్థాయి కంటే 20 రెట్లు ఎక్కువ‌గా ఉంది. అదృష్ట‌వ‌శాత్తు ఆ క‌ణితి ల‌క్ష‌ణాలు శ‌రీరంలోని ఇత‌ర భాగాలకు వేటికీ వ్యాపించ‌లేద‌ని పెట్ సీటీ స్కాన్‌లో నిర్దర‌ణ అయ్యింది. ఈ రోగి ఇప్ప‌టికే కిడ్నీ మార్పిడి చేయించుకుని, ఇమ్యునోస‌ప్రెసెంట్ మందులు వాడుతుండ‌టంతో కీమోథెర‌పీ, రేడియేష‌న్ లాంటి చికిత్స‌లు ఏవీ ప‌నిచేయ‌వు. శ‌స్త్రచికిత్స మాత్ర‌మే చేయాలి. ఇందుకు అతడు అంగీకరించాడు. ముందుగా అన‌స్థీషియా ఇచ్చి శ‌స్త్రచికిత్స కోసం రోగిని సిద్ధం చేసి రోగికి జ‌న‌ర‌ల్ అన‌స్థీషియాలో ఒక సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేశాం.' అని డాక్టర్లు తెలిపారు.

'శ‌స్త్రచికిత్స‌లో భాగంగా సాధార‌ణం కంటే కాస్త పెద్ద కోత పెట్టాం. ఎడ‌మ‌వైపు తొడ భాగం నుంచి ఉద‌ర భాగానికి ఈ కోత పెట్టాం. త‌ద్వారా లింఫ్‌నోడ్స్ వైపు ముప్పు విస్త‌రించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాం. చుట్టుప‌క్క‌ల ఉన్న మూత్ర‌కోశం, ప్ర‌ధాన ర‌క్త‌నాళాల‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌కుండా అత్యంత జాగ్ర‌త్త‌గా, విజ‌య‌వంతంగా క‌ణితిని తొల‌గించాం. దాదాపు 40 సెంటీమీట‌ర్ల పొడ‌వు, డంబెల్ ఆకారంలో ఉన్న ఈ క‌ణితిని వీలైనంత త‌క్కువ ర‌క్త‌స్రావంతో తొల‌గించ‌గలిగాం. ' - ఏఐఎన్​యూ వైద్యులు

ప్రపంచంలోనే అతిపెద్ద కణితి తొలగింపు- బరువు ఎంతంటే?

సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్​ వైద్యులు.. రోగి కిడ్నీ నుంచి 10 కిలోల కణితి తొలగింపు

Last Updated : May 29, 2024, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.