ETV Bharat / state

మహాలక్ష్మి పథకానికి క్రేజీ రెస్పాన్స్ - స్కీమ్ ఓకే కానీ బస్సులు పెంచాలంటున్న మహిళలు - Mahalakshmi Scheme In Telangana

Mahalakshmi Scheme in Telangana : మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో ప్రయాణికుల సంఖ్య రెండింతలు పెరిగింది. ఉచిత బస్సు ప్రయాణం బాగుందని ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచితే ఇంకా బాగుంటుందని వారు అంటున్నారు.

Mahalakshmi Scheme In Telangana
Mahalakshmi Scheme In Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 12:48 PM IST

Updated : May 2, 2024, 1:18 PM IST

Mahalakshmi Scheme in Joint Nalgonda District : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ హామీని హస్తం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు.ఈ పథకానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనూహ్యస్పందన లభిస్తోంది. దీంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఖాళీ లేకుండా వెళ్తున్నాయి.

Mahalakshmi Scheme in Telangana : ఈ పథకం అమల్లోకి రాక ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజియన్‌ పరిధిలోని 7 డిపోల్లో ప్రతిరోజూ 2 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షలకు చేరింది. ఇందులో 2 లక్షల మంది మహిళలే ఉండడం గమనార్హం. నల్లగొండ రీజియన్‌లో 7 డిపోలకుగానూ 637 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో ఆర్టీసీ 383, అద్దె బస్సులు 254 ఉన్నాయి.

మహాలక్ష్మి పథకం బాగుందన్న మహిళలు : మహాలక్ష్మి పథకంతో గతంలో కంటే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగడంతో బస్సులో పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ పథకం తమకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు. బస్సు ఛార్జీలు మిగలడంతో వేరే అవసరాలకు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. మరోవైపు స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాక బస్సలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పీక్‌ అవర్స్‌లో పురుషులు ప్రయాణించటం కష్టంగా మారింది. బస్సుల సంఖ్య పెంచితే చాలా బాగుంటుందని వారు పేర్కొంటున్నారు.

మహాలక్ష్మి పథకానికి క్రేజీ రెస్పాన్స్

"ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా బాగుంది. మా లాంటి మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషం. ఎక్కడికైనా జీరో టికెట్ ఇస్తున్నారు.తమకు ఛార్జీలు మిగులుతున్నాయి. వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలియజేేస్తున్నాం. అలాగే రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నాం." - మహిళలు

ఆర్టీసీలో 100 శాతం దాటుతోన్న ఆక్యుపెన్సీ - రిపేర్ల కోసం షెడ్లకు క్యూ కడుతోన్న బస్సులు

TSRTC Free Bus Service Woman in Telangana :మరోవైపు పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేవారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం సగటున రోజుకు 29.67 లక్షల మంది స్త్రీలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొంది. డిసెంబర్ మాసంలో సగటున 26.99 లక్షల మంది, జనవరిలో సగటున 28.10 లక్షలు, ఫిబ్రవరిలో సగటున 30.56 లక్షలు, మార్చిలో సగటున 31.42 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించింది. ఏప్రిల్ 7వ వరకు రూ. 1,177 కోట్ల విలువైన జీరో టికెట్లను జారీ చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.

మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ - బస్సుల్లో సీట్ల కోసం మగవాళ్ల పాట్లు - పురుషుల కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు

మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ - టీఎస్​ఆర్టీసీలో భారీగా తగ్గిన బస్ పాసులు - Bus Passes Decreased in RTC

Last Updated : May 2, 2024, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.