ETV Bharat / state

జనాలను హడలెత్తించిన సీఎం సభ- ఇంట్లో ఉన్నవారు సేఫ్! బస్సుల బంద్​కు తోడు పోలీసు ఆంక్షలు

Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting: జగనన్న సభలుంటే జనానికి కష్టాలే అని మరోసారి రుజువైంది. వైసీపీ సిద్ధం సభ కోసం అధికారులు ఆర్టీసీ బస్సులను తరలించడంతో పట్టపగలే ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. అత్యవసర పనుల కోసం బైటకు వచ్చిన వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. కొన్ని చోట్ల బస్సులు లేక ఆర్టీసీ ప్రాంగణాలు వెలవెలబోయాయి.

_jagan_siddham_meeting
_jagan_siddham_meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 7:43 PM IST

Updated : Mar 10, 2024, 7:48 PM IST

Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting: మేదరమెట్ల సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులను అధికారులు తరలించడం ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 500కు పైగా బస్సులను సిద్ధం సభకు తరలించడంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాలేదు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, కార్యాలయాలకు వెళ్లే వారు బస్సులు రాక ఇబ్బందిపడ్డారు. అధికారులు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించిన జనం రాజకీయ సభలకు ప్రయాణికుల బస్సులను వాడుకునే సంప్రదాయం ఏంటని ప్రశ్నించారు.

వైసీపీ నేతల అరాచకం - 'సిద్ధం' సభకు పిలిచినా రాలేదని కర్రలు, రాడ్లతో దాడి

గుంటూరు జిల్లా నుంచి భారీగా బస్సులను సిద్ధం సభకు తరలించారు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో బస్సులు లేక ప్రాంగణాలు వెలవెలబోయాయి. గుంటూరు, నరసరావుపేట, తెనాలి, పొన్నూరు, పర్చూరు, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాలకు వెళ్లేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చిలకలూరిపేట నుంచి సిద్ధం సభ జరుగుతున్న మేదరమెట్ల వైపు బస్సులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చీరాల మీదుగా దారిమళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు మార్గమధ్యలో బస్సులు దిగి గమ్యస్థానాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు. మంగళగిరి డిపోలో 23 బస్సులు ఉంటే వాటన్నింటినీ సిద్ధం సభకు తరలించారు.

వైసీపీ 'సిద్ధం' సభ కవరేజీకి వెళ్లొద్దు - మీడియా సిబ్బందికి పోలీసుల నోటీసులు

సత్తెనపల్లిలో డిపోలో 45 బస్సులకు గాను 25 వాహనాలను సిద్ధం సభలకు తరలించారు. గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. ఆటోలు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు పంపారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో మొత్తం 96 బస్సులు ఉండగా 80 బస్సులను సభకు పంపారు. చాలా సేపు బస్టాండ్‌లో వేచి ఉన్న జనం బస్సులు ఏవని అధికారులను నిలదీశారు. జగన్‌ను అడగాలని వారు దురుసుగా సమాధానం ఇచ్చారని ప్రయాణికులు వాపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి డిపో నుంచి 48 బస్సులను సిద్ధం సభకు తరలించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఎండలో ఆటోల కోసం నిరీక్షించారు. మార్కాపురం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.

సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వందల ఆర్టీసీ బస్సులను మేదరమెట్ల తరలించారు. తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. తిరుపతి జిల్లా నుంచి 155, చిత్తూరులో 125 బస్సు సర్వీసులను సిద్ధం సభలకు కేటాయించారు. ఒకటీ రెండు బస్సులు వచ్చినా వాటిల్లో సీట్ల కోసం జనం ఎగబడ్డారు. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల బస్సులను వైసీపీ నేతలు వదలలేదు. నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ జనం లేక వెలవెలబోయింది. ఆరు ప్రధాన డిపోల నుంచి 332 బస్సులను వైసీపీ సభకు తరలించారు. ప్రయాణికులను గాలికొదిలేసి పార్టీల సేవలో ఆర్టీసీ తరించడం దారుణమని జనం ఆక్షేపించారు.

ఏలూరు జిల్లా నూజివీడులో ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. ప్రైవేట్ వాహనదారులు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేశారు. సిద్ధం సభకు 25 బస్సులు పంపామని డిపో మేనేజర్ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి ఆర్టీసీ బస్సులను మేదరమెట్ల తరలించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జనాన్ని తరలించారు. 600 కిలోమీటర్ల నుంచి బస్సుల్లో జనాన్ని తరలించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

జనాలను హడలెత్తించిన సీఎం సభ

Last Updated : Mar 10, 2024, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.