52 Kgs Liquid Ganja Seized in Alluri District : అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో సుమారు రూ. 5 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బలపం పంచాయతీ ఎర్రగుప్ప వద్ద ద్రవరూప గంజాయి నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలో సుమారు 5 కోట్ల 50 లక్షల విలువైన 52 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకుని, నిందితుడు ప్రకాశ్‌రావును అరెస్టు చేసినట్లు ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఒడిశాలోని రైతుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ద్రవరూపంలోకి మార్చి తరలించే ప్రయత్నంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.
ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సర్వీస్ రోడ్డులో సీజ్ చేసిన మద్యాన్ని పోలీసులు 1200 కేసుల మద్యాన్ని ధ్వంసం చేశారు. స్థానిక శ్రీనివాస గార్డెన్స్ మామిడి తోటలో అక్రమంగా నిలువ చేసి ఉంచిన రూ.80లక్షల విలువైన 58,032 మద్యం బాటిల్స్‌ను సీజ్ చేశారు.
ఆ నియోజకవర్గంలో మంచి నీరు దొరకడం కష్టం కానీ మద్యం మాత్రం విచ్చలవిడిగా లభిస్తోంది. ఎటు చూసినా పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది. గ్రామగ్రామాన నాటుసారా గుబాళిస్తోంది. చాక్లెట్లు దొరికినంతా సులభంగా గంజాయి దొరుకుతోంది. కనుచూపు మేర మట్కా సెంటర్లే కన్పిస్తాయి. ఎన్ని కేసులు నమోదు చేసినా ఎంతమందిని అరెస్టు చేసినా వీటికి అడ్డుకట్టపడటం లేదు. ఇదీ వైఎస్సార్సీపీ పాలనలో డోన్ నియోజకవర్గం దుస్థితి. సొంత ఇలాకాలో ఇంత జరుగుతున్నా మంత్రి బుగ్గన మాత్రం తనకు ఏం సంబంధం లేనట్లే మొద్దునిద్ర నటిస్తున్నారు.
Huge Liquor Seized in Dhone : వైఎస్సార్సీపీ పాలనలో నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం అక్రమ మద్యం, నాటు సారా, మట్కాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. డోన్ పట్టణం సహా గ్రామాల్లోనూ కర్నాటక, తెలంగాణ మద్యం ఇబ్బడిముబ్బడిగా దొరుకుతోంది. పెద్ద మొత్తంలో నాటుసారా కేసులు నమోదవుతున్నాయి. 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ 15 వరకు అంటే కేవలం నాలుగున్నర నెలల కాలంలో సెబ్ అధికారులు 129 నాటు సారా కేసులు నమోదు చేశారు. 108 మందిని అరెస్టు చేసి 3వేల108 లీటర్ల సారా, 4 వాహనాలు సీజ్ చేశారు. 39వేల 510 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం అమ్మిన బెల్టు షాపులపై 54 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్టు చేశారు. 266 లీటర్ల మద్యం సీజ్ చేశారు. ఇవి కాకుండా కర్నాటక, తెలంగాణకు చెందిన 918 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి 10 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ గణాంకాలు చూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Cannabis Seized : గంజాయి మహమ్మారిలా పాకుతోంది. యువత దీనికి బానిసలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. గంజాయి రవాణాన్ని అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 2022లో ఒక కేసు నమోదు చేసి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. 2023లో కేసుల సంఖ్య 9కి పెరిగింది. ఆ సమయంలో 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 18 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాదిలో రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా 3 కేసులు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు.
'రాష్ట్రంలో లభ్యమయ్యే మద్యం నకిలీది కావటంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం, సారా, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వేల లీటర్ల అక్రమ మద్యం పట్టుబడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.'- స్థానికులు
గుడివాడలో గంజాయి బ్యాచ్ వేధింపులు - భక్షక ఖాకీలపై చర్యలేవి ? - GANJA BATCH WAS HARASSED FAMILY