ETV Bharat / state

మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం - పార్వతి బ్యారేజ్​కు పెరుగుతున్న వరద - Flood Inflow To Parvati Barrage

Huge Flood Inflow To Parvati Barrage : మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు, స్థానికంగా ఉన్న వాగులు కూడా ఉప్పొంగడంతో పార్వతి బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో 4,24,915 క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదవుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వచ్చిన నీటినంతా దిగువకు వదులుతున్నారు.

Huge Flood Inflow To Parvati Barrage
Huge Flood Inflow To Parvati Barrage (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 4:29 PM IST

Huge Flood Inflow To Parvati Barrage : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్​కు నాలుగు రోజులుగా ఇన్​ఫ్లో పెరుగుతోంది. మంథని గుండా ప్రవహించే గోదావరి నది, బొక్కల వాగు, నల్ల వాగుల నుంచి వస్తున్న ప్రవాహంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. గోదావరి, బొక్కల వాగులు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా నీటిని భారీగా విడుదల చేయడంతో సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్​కు 4,24,915 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 74 గేట్లు ఎత్తిపెట్టి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి : ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంథని వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవాహం కొనసాగుతోంది. మండలంలోని పోతారం, ఖానాపూర్, అమ్మగారి పల్లి కాన్సాయిపేటలో వందలాది ఎకరాల్లో పంట పొలాలు గత మూడు రోజులుగా వరదనీటిలో ఉండిపోయాయి. కమాన్​పూర్ మండల కేంద్రంలోని గుండారం చెరువు మత్తడి పోస్తోంది.

మంథని వద్ద గోదావరిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు : సుందిళ్ల బ్యారేజ్ నుండి నీటిని కిందికి వదలడంతో పశువుల కాపర్లు, చేపలు పట్టేవారు గోదావరిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం మంథని వద్ద గోదావరి ఉద్ధృతిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరిశీలించారు.

ఎలాంటి ప్రాణనష్టం, పంటనష్టం జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కట్టలు బలహీనంగా ఉన్న చెరువులపై దృష్టి ఉంచాలని కల్వర్టులను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. జనావాసాల్లోకి వరదనీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
వానొచ్చింది.. వరద తెచ్చింది.. పంట పొలాలను ముంచేసింది

పార్వతి బ్యారేజ్​ను పరిశీలించిన నిపుణుల బృందం - ఇంజినీర్లను అడిగి వివరాలు సేకరణ - Expert Team Visit Parvathi Barrage

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.