ETV Bharat / state

లోక్​సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - సైబరాబాద్ పరిధిలో రూ. 3.16కోట్ల సొత్తు స్వాధీనం - Huge Amount Of Money Seized - HUGE AMOUNT OF MONEY SEIZED

Huge Amount Of Money Seized in Hyderabad : పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడాన్ని పోలీస్ యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడే చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎన్నికల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రూ. 3.16కోట్ల విలువ చేసే సొత్తును సీజ్ చేశారు.

Cash Seized in Hyderabad
Huge Amount Of Money Seized in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 12:06 PM IST

Huge Amount Of Money Seized in Hyderabad : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు విస్తృత సోదాలు చేపడుతున్నారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో సుమారు రూ. 3.16 కోట్ల విలువ చేసే సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రూ. 3.16కోట్ల విలువ చేసే సొత్తును సీజ్ చేశారు. బాచుపల్లి పీఎస్ పరిధిలో స్థానిక పోలీసులతో కలిసి బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు రెండు బైకులు తనిఖీ చేసి రూ. 22లక్షలనగదు జప్తు చేసుకున్నారు. అఖిల్, శశి కిరణ్​లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లోక్​సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీలు - ఇప్పటి వరకు రూ.155 కోట్లు సీజ్ - CASH SEIZED IN TELANGANA 2024

Cash Seized in Hyderabad : మేడ్చల్​లో నిబంధనలు పాటించకుండా ఏటీఎంకు నగదు తరలించే వాహనంలో తీసుకువెళ్తున్న రూ. 24.91లక్షలను మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్​పల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ వద్ద రేడియంట్ లాజిస్టిక్స్ వాహనంలో రూ.2.63లక్షలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు రామ్‌దేవ్ ఆసుపత్రి సమీపంలో కూకట్‌పల్లి ఎస్వోటీ పోలీసులు తనిఖీ చేపట్టారు. బీవీసీ లాజిస్టిక్స్ వాహనంలో రూ. 2.66కోట్ల విలువ చేసే 4 కిలోల బంగారం, 4కిలోల వెండిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు జప్తు చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Huge Amount Seized in Election Code : ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్నప్పుడు రూ.50 వేలకు మించి అధికంగా డబ్బులు తీసుకొని వెళ్తే పోలీసులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ నగదును ఏటీఎం ద్వారా తీస్తే రిసిప్ట్​ చూపించాల్సి ఉంటుంది. అదే మెడికల్​ ఎమర్జెన్సీ కోసమైతే రోగి వివరాలు, అపరేషన్​కు అయ్యే ఖర్చు తదితర విషయాలను చూపించాల్సి ఉంటుంది. సరైన ఆధారాలు లేనిచో పోలీసులు ఆ నగదును సీజ్​ చేస్తారు.

గుట్టుచప్పుడు కాకుండా బ్యాంక్ వాహనాల్లో నగదు తరలింపు - ఒక్కరోజే రూ.కోటికి పైగా సొత్తు స్వాధీనం - 1 CRORE SEIZED IN HYD IN 1 DAY

ఎన్నికల వేళ పోలీసుల సోదాలు - ఇప్పటివరకు రూ.104 కోట్ల నగదు సీజ్​ - HUGE AMOUNT OF CASH SEIZED IN TS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.