ETV Bharat / state

ముగిసిన అమెరికా పర్యటన - సియోల్​కు చేరుకున్న రేవంత్&టీమ్ - CM REVANTH SEOUL TOUR TODAY - CM REVANTH SEOUL TOUR TODAY

CM Revanth America Tour Ended : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాల ద్వారా రూ.31,532 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీనివల్ల రానున్న రోజుల్లో కొత్తగా 30,750 ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావడం శుభసూచకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు అమెరికా పర్యటన ముగిసిన వెంటనే దక్షిణ కొరియాలోని సియోల్‌కు సీఎం పర్యటనా నిమిత్తం చేరుకున్నారు.

CM Revanth America Tour Completed
America Investments in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 7:00 AM IST

Updated : Aug 12, 2024, 9:27 AM IST

America Investments in Telangana : పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించి, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు.

రాష్ట్రానికి రూ.31,532 కోట్ల పెట్టుబడులు, 19 కంపెనీలతో డీల్స్​ - ముగిసిన ముఖ్యమంత్రి అమెరికా పర్యటన (ETV Bharat)

దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఈనెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్‌లు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి.

అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు : ప్రముఖ బహుళ జాతి సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్‌, ఆమెజాన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది.

అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకమని అన్నారు.

CM Revanth South Korea Visit : అమెరికా పర్యటన ముగిసిన మరుక్షణమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం ఇవాళ దక్షిణ కొరియాలోని సియోల్​కు చేరుకుంది. హ్యుందాయ్ మోటార్స్, యూయూ ఫార్మా, శాంసంగ్, ఎల్.జి తదితర కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. హన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించి దానికి సంబంధించిన అధికారులతో చర్చించనుంది. ఈనెల 14న ఉదయం 10:30 కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.

హైదరాబాద్​పై పెట్టుబడుల వర్షం - రూ.3320 కోట్లతో 'ఆరమ్‌ ఈక్విటీ' గ్రీన్ డేటా సెంటర్ - AURUM EQUITY INVESTS IN HYDERABAD

యాపిల్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ - ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులపై చర్చలు - CM REVANTH AMERICA TOUR

Last Updated : Aug 12, 2024, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.