How to Pay Power Bills in AP: థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్‌లతో విద్యుత్ బిల్లుల చెల్లించే ప్రక్రియను నిలిపివేశారు. దీంతో వినియోగదారులు కరెంట్ బిల్లులను ఎలా చెల్లించాలి అనే డైలమాలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఇకపై విద్యుత్ బిల్లులను ఎలా చెల్లించాలి?, అందుకోసం ఏ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలు మీకోసం.
ఇకపై విద్యుత్ బిల్లును చెల్లించటం ఎలా?
రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వినియోగదారులకు విద్యుత్ బిల్లులు చెల్లించే విధానాలను కేటాయించారు. ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ అనే మూడు మొబైల్ యాప్స్‌ను తీసుకొచ్చారు. వీటితో పాటు https://apepdcl.in/, https://apcpdcl.in/, https://apspdcl.in/ అనే మూడు అధికారిక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇకపై ఆయా ప్రాంతాలను బట్టి వినియోగదారులు మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కరెంట్ బిల్లులను నేరుగా చెల్లించవచ్చు.
ఏ ప్రాంతాల వారు ఎలా చెల్లించాలి?
- ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఇకపై APEPDCL(ఏపీ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) యాప్ లేదా https://apepdcl.in/ అనే వెబ్‌సైట్ ద్వారానే విద్యుత్ బిల్లును చెల్లించాలి.
- ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఇకపై APCPDCL(ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) యాప్ లేదా https://apcpdcl.in/ అనే వెబ్‌సైట్ ద్వారానే కరెంట్ బిల్లును చెల్లించాలి.
- ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు ఇకపై APSPDCL(ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) మొబైల్ యాప్ లేదా https://apspdcl.in/ అనే వెబ్‌సైట్ ద్వారానే విద్యుత్ బిల్లును చెల్లించాలి.
యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?:
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇందుకోసం మీ ప్రాంతాన్ని బట్టి ఈ లింక్స్‌పై క్లిక్ చేయండి:
- https://play.google.com/store/apps/details?id=com.apepdcl.easternpower
- https://play.google.com/store/apps/details?id=com.apspdcl.consumerapp
- https://play.google.com/store/apps/details?id=com.apcpdcl.customerapp
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత తొమ్మిది అంకెల యూఎస్‌సీ (USC- Unique Service Number) నంబర్, పేరు, ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- తర్వాత Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేసి.. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీకు స్క్రీన్‌పై కన్పిస్తున్న Pay Bill ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.
- ఆ వివరాలను చెక్ చేసుకుని.. మెయిల్ ఐడీ ఎంటర్ చేసి Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. Pay With AP Online/ Bill Desk అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలి.
- ఉదాహరణకు Bill Desk పై క్లిక్ చేస్తే స్క్రీన్ మీద మనం చెల్లించాల్సిన బిల్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. అందులో Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. పేమెంట్ ఆప్షన్ కనిపిస్తాయి. అంటే క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI యాప్స్.. ఇలా కనిపిస్తాయి.
- అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసి Make a Payment ఆప్షన్‌పై క్లిక్ చేసి Proceed with Payment ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేయవచ్చు.
- అలాగే మీరు బిల్లు చెల్లించిన తర్వాత Bill Historyపై క్లిక్ చేసి.. పేమెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
- పాత విధానంలో కంటే ఈ సరికొత్త యాప్ ద్వారా విద్యుత్ బిల్లులను సులభంగా చెల్లించుకోవచ్చు.
వెబ్సైట్లో బిల్లు చెల్లించండిలా:
- ఇందుకోసం మొదట మీరు మీ ప్రాంతాన్ని బట్టి అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Pay Bill Online అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ 9 అంకెల యూఎస్‌సీ(USC) నెంబర్‌ను ఎంటర్ చేసి.. Submit ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- స్క్రీన్ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్ చేసుకుని.. Current Month Bill సెక్షన్లో Click Here to Pay ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
- అందులో ఏదో ఒక దానిని సెలక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు.. T Wallet ద్వారా బిల్ పే చేయాలనుకుంటే T-Wallet ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్‌పై క్లిక్ చేసి USC నెంబర్ ఎంటర్ చేసి Fetch Bill ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ అన్ని వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేసేయొచ్చు.
- అంతే ఇలా సింపుల్‌గా వెబ్‌సైట్ ద్వారా మీ విద్యుత్ బిల్లును కట్టవచ్చు.