ETV Bharat / state

G-pay, Phonepe కట్ - వెబ్​సైట్ & యాప్ ద్వారా కరెంట్ బిల్లు ఎలా కట్టాలో మీకు తెలుసా ? - How To Pay current Bill On TGSPDCL - HOW TO PAY CURRENT BILL ON TGSPDCL

Pay current Bill On TGSPDCL App : రాష్ట్ర ప్రజలకు అలర్ట్​. ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇక నుంచి డిస్కం వెబ్‌సైట్‌ లేదా టీజీఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే కరెంటు బిల్లులు చెల్లించాలి. మరి వాటి ద్వారా ఎలా పే చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..

current Bill On TGSPDCL App
Pay current Bill On TGSPDCL App (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 11:25 AM IST

How To Pay current Bill On TGSPDCL App : రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక. ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఈ నెల(జులై) నుంచి విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ - టీజీఎస్‌పీడీసీఎల్‌ ఎక్స్‌(ట్విట్టర్​) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇక నుంచి డిస్కం వెబ్‌సైట్‌ లేదా టీజీఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. మరి వాటి ద్వారా ఎలా పే చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

డిస్కం వెబ్‌సైట్‌ ద్వారా బిల్లులను ఎలా చెల్లించాలి:

  • మొదట మీరు TSSPDCL అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి.
  • ఓ కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది. అందులో Pay Bill online ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఇప్పుడు మీరు 9 అంకెల యూఎస్‌సీ(USC -Unique Service Number) నెంబర్‌ను ఎంటర్‌ చేసి.. Submit బటన్​పై క్లిక్​ చేయాలి.
  • స్క్రీన్​ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్​ చేసుకుని.. Current Month Bill సెక్షన్​లో Click Here to Pay ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది. అందులో పేమెంట్​ చేయడానికి రకరకాల ఆప్షన్​లు అందుబాటులో ఉంటాయి.
  • అందులో ఏదో ఒక దానిని సెలక్ట్​ చేసుకోవాలి. ఉదాహరణకు.. T Wallet ద్వారా బిల్​ పే చేయాలనుకుంటే T-Wallet ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • కొత్త విండో ఓపెన్​ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్​పై క్లిక్​ చేసి USC నెంబర్​ ఎంటర్​ చేసి Fetch Bill ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • వివరాలు అన్ని స్క్రీన్​ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్​పై క్లిక్​ చేసి పేమెంట్​ చేయాలి.
  • అంతే ఇలా సింపుల్‌గా వెబ్‌సైట్‌ ద్వారా కరెంట్‌ బిల్లును చెల్లించవచ్చు.

యాప్‌ ద్వారా విద్యుత్‌ బిల్లును ఎలా చెల్లించాలి ?

  • మొదట గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి TGSPDCL యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.
  • తర్వాత రిజిస్టర్​ చేసుకోవాలి. అందుకోసం.. మీరు 9 అంకెల యూఎస్‌సీ నెంబర్‌, పేరు, మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి.. Get OTP ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • మీ నెంబర్‌కు వచ్చిన OTP ఎంటర్‌ చేసి Register ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు మీరు స్క్రీన్‌పైన కనిపిస్తున్న Pay Bill ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే.. వివరాలు వస్తాయి.
  • ఆ వివరాలను చెక్‌ చేసుకుని.. మెయిల్​ ఐడీ ఎంటర్​ చేసి Proceed to Pay ఆప్షన్​పై క్లిక్​ చేసి పేమెంట్​ చేయవచ్చు.
  • అలాగే మీరు బిల్లు చెల్లించిన తర్వాత Bill Historyపై క్లిక్‌ చేసి.. పేమెంట్‌ వివరాలను చెక్‌ చేసుకోవచ్చు.
  • ఇలా ఈజీగా యాప్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులను చెల్లించుకోవచ్చు.

ఇక నుంచి ఫోన్‌ పే, గూగుల్‌ పేలో కరెంట్‌ బిల్ కట్టొద్దు - మరి పేమెంట్ ఎక్కడ చేయాలంటే? - NO CURRENT BILL PAYEMENTS ON UPI

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - ఇక నుంచి ప్రతి ఏటా ఉద్యోగ జాతరే! - మరో వారంలో జాబ్ క్యాలెండర్ - TELANGANA JOB CALENDAR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.