How to Pay Current Bill by App and Website: ఒకప్పుడు కరెంట్ బిల్లు కట్టాలంటే విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి కట్టేవాళ్లు. జనరేషన్ మారడంతో.. ఆ తర్వాత ఆన్లైన్, అనంతరం డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇటీవలే(జులై 1 నుంచి) థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్(ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే) నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. ఈ క్రమంలోనే చాలా మంది కరెంటు బిల్లు ఎలా చెల్లించాలి అనే డైలమాలో పడ్డారు. మీరూ ఆ లిస్ట్ లో ఉన్నారా? అయితే టెన్షన్ అక్కర్లేదు. విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఓ విధానాన్ని అమలుపరుస్తోంది. అదే TGSPDCL వెబ్‌సైట్ అండ్ TGSPDCL మొబైల్ యాప్. మరి వీటి ద్వారా ఎలా పే చేయాలంటే..
TGSPDCL మొబైల్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లును ఎలా చెల్లించాలి ?
- మొదట గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి TGSPDCL యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. అందుకోసం.. మీ 9 అంకెల యూఎస్‌సీ(USC) నెంబర్, పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి.. Get OTP ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మీ నెంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేసి Register ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు స్క్రీన్‌పైన కనిపిస్తున్న Pay Bill ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. వివరాలు వస్తాయి.
- ఆ వివరాలను చెక్ చేసుకుని.. మెయిల్ ఐడీ ఎంటర్ చేసి Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. Pay With T-Wallet/ Bill Desk/Paytm అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక పద్ధతి ఎంచుకోవాలి.
- ఉదాహరణకు Bill Desk పై క్లిక్ చేస్తే స్క్రీన్ మీద మనం చెల్లించాల్సిన బిల్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. అందులో Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. పేమెంట్ ఆప్షన్ కనిపిస్తాయి. అంటే క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI యాప్స్.. ఇలా కనిపిస్తాయి.
- అందులో ఒకదాన్ని సెలెక్ట్ చేసి Make a Payment ఆప్షన్‌పై క్లిక్ చేసి Proceed with Payment ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేయవచ్చు.
- అలాగే మీరు బిల్లు చెల్లించిన తర్వాత Bill Historyపై క్లిక్ చేసి.. పేమెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా యాప్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించుకోవచ్చు.
TGSPDCL వెబ్‌సైట్ వెబ్‌సైట్ ద్వారా బిల్లులను ఎలా చెల్లించాలి:
- మొదట మీరు TSSPDCL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Pay Bill online ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీరు 9 అంకెల యూఎస్‌సీ(USC -Unique Service Number) నెంబర్‌ను ఎంటర్ చేసి.. Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద వివరాలు కనిపిస్తాయి. వాటిని చెక్ చేసుకుని.. Current Month Bill సెక్షన్లో Click Here to Pay ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పేమెంట్ చేయడానికి రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
- అందులో ఏదో ఒక దానిని సెలక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు.. T Wallet ద్వారా బిల్ పే చేయాలనుకుంటే T-Wallet ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Postpaid ఆప్షన్‌పై క్లిక్ చేసి USC నెంబర్ ఎంటర్ చేసి Fetch Bill ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- వివరాలు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అవి వెరిఫై చేసుకుని Proceed to Pay ఆప్షన్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేయాలి.
- అంతే ఇలా సింపుల్‌గా వెబ్‌సైట్ ద్వారా కరెంట్ బిల్లును కట్టవచ్చు.
Mee Seva: ఒకవేళ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కరెంట్ బిల్ పే చేయలేని వారు దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా బిల్లు కట్టవచ్చు.
ఒక్క క్లిక్‌తో కరెంట్ బిల్లు కట్టేయొచ్చు - ఈ QR కోడ్ విధానం మీకోసమే?