ETV Bharat / state

మీ ఫ్రెండ్ మంచివాడేనా? - ఈ క్వాలిటీస్ ఉంటే దూరం పెట్టేయండి!! - How to choose a good friend

How to Choose A Good Friend : స్నేహితుడు అనేవాడు నిజంగా దేవుడిచ్చిన పెద్ద వరం. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు, ఓటమి చెందినప్పుడు, బాధలో ఉన్నప్పుజు తల్లిదండ్రుల కన్నా స్నేహితుడే ఎక్కువ అండగా ఉంటాడు. మరి స్నేహితుల్లో మంచి వాడు, చెడ్డ వాడిని గుర్తించడం ఎలా?. అసలు ఎలాంటి వ్యక్తిని స్నేహితుడిగా పొందాలి. మీ ఫ్రెండ్​ మంచివాడేనా? అతడిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా? ఓసారి చెక్ చేస్కోండి.

How to Choose A Good Friend
How to Choose A Good Friend (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 10:31 AM IST

Updated : Jul 5, 2024, 2:48 PM IST

Tips For Good Friendship in Telugu : "స్నేహితుల చేతులు ఎప్పుడూ కలిసే ఉండాలని చెబుతారు. కానీ నిజమైన స్నేహానికి ఆ అవసరం లేదు. ఎందుకంటే స్నేహితులకు తెలుసు ఓ చేయి ఎప్పుడు తోడుంటుంది" అని జాతిపిత మహాత్మాగాంధీ ఆనాడే చెప్పారు. నిజంగానే ఆ మహానుభావుడు చెప్పిందే అక్షర సత్యం. ఎందుకంటే మంచి స్నేహాన్ని కోరుకుంటే అది జీవితానికి వరంగా మారుతుంది. అదే చెడు స్నేహం ఉంటే జీవితమే నాశనం అవుతుంది. అందుకే పెద్దలు ఎప్పుడు చెబుతారు స్నేహితుడి ఎంపికలో ఉత్తమంగా ఉండాలని.

కానీ అదే పెద్దలు సైతం ఒక మాట చెప్పారు. కుటుంబం, బడి, కోర్సు ఇలా నీవు ఏవైనా ఎంచుకునే అవకాశం లేకపోవచ్చు కానీ స్నేహితుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మాత్రం ఉందని. అందుకే ఓ ఉన్నతమైన ఫ్రెండ్​ షిప్​ను కోరుకో లేకపోతే ఆ స్నేహమే చర్చకు అవకాశంగా మారుతుంది. అయితే నేటి రోజుల్లో స్నేహ బంధాల గురించి కాస్త ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే స్నేహం పేరుతో ఎన్నో అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయి. అందుకే వీటి పట్ల యువత కాస్త జాగ్రత్తగా ఉంటే మేలు. కానీ కొన్ని స్నేహాలు అందరికీ గుర్తుండేలా చిరస్థాయిలో నిలిచిపోతున్నాయి.

స్నేహితుల ఎంపికలో జాగ్రత్త : ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పిల్లలు ఉన్నతస్థానాల్లో నిలవాలని, వారికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో వివిధ ప్రాంతాల్లో చేర్పిస్తుంటారు. కానీ అక్కడ వారిని కనిపెట్టుకుని ఉండలేరు కదా. పాఠశాల స్థాయి వరకు అయితే ఎలాంటి స్నేహం చేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. వారంతా లోకల్​గానే ఉండటంతో వారి గురించి తెలుస్తోంది. ఒకవేళ పాఠశాల స్థాయిలోనే ఎక్కడో హాస్టల్​లో ఉండి చదివిస్తే అక్కడ అన్ని దాదాపు కొత్త ముఖాలే కనిపిస్తాయి. ఇంటికి దూరంగా ఉన్నా చిన్నవాళ్లు కావడంతో ఎలాంటి హద్దులు దాటిపోరని తల్లిదండ్రుల బలమైన నమ్మకం.

అదే కళాశాల స్థాయికి వచ్చే సరికి దాదాపు అన్ని కొత్త ముఖాలే కనిపిస్తాయి. దీంతో అక్కడ ఎలాంటి వారు స్నేహితులుగా వస్తారో చెప్పడం కష్టం. అందులో మంచివాళ్లు ఉండవచ్చు చెడ్డవాళ్ల ఉండవచ్చు. అందుకే స్నేహితుల ఎంపికలో ఈ విషయాలను గమనిస్తే కొంత నయం. ఎవరి అంతరంగాన్ని మనం అంచనా వేయలేం. అయితే వారి ప్రవర్తన, ఆలోచనలు, మాటలతో కొంత అప్రమత్తం కావొచ్చు. స్వార్థపూరిత, దురాశ, దుర్బుద్ధి ఉన్న వారితో ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే అలాంటి స్నేహితుల విషయంలో విద్యార్థులు జాగ్రత్త వహిస్తే మంచిది. మంచివారు స్నేహితులుగా దొరికితే మాత్రం అస్సలు మిస్​ చేసుకోవద్దు మిత్రమా!

మంచి మిత్రుత్వం : ఉమ్మడి నిజామాబాద్​లోని బోధన్​ మండలం పెంటాకుర్దులో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న సుబ్బారావు, శ్రీనివాసులు బాల్య మిత్రులు. వారి తరగతులు వేరైన ఒకే బడిలో చదువుకున్నారు. ఆ తర్వాత బీఈడీ కలిసి చదివారు. అనంతరం రుద్రూరుకు చెందిన వెంకటరమణతో కలిసి చదువుకుని 1998లో డీఎస్సీలో ఉద్యోగం సాధించారు. ఇప్పటికీ వారి మధ్య స్నేహ బంధం చిరస్థాయిగా ఉంది. సుబ్బారావు, శ్రీనివాసు చదువుకున్న బడిలోనే కలిసి పని చేస్తున్నారు.

చెడు స్నేహాలతో బలైన జీవితాలు :

  • గతేడాది డిసెంబరులో ఉమ్మడి నిజామాబాద్​లోని మాక్లూర్​ మండల పరిధిలో బయటపడిన ఆరు హత్యల కేసు స్నేహంలో మోసానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆస్తి కోసం స్నేహితుడి కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశాడు.
  • గతేడాది ఉమ్మడి నిజామాబాద్​లోని నందిపేట పరిధిలో అమ్మాయి ప్రేమ కోసం స్నేహితుడిని మిత్రులే అంతమొందించిన ఘటన.
  • నిజామాబాద్​ గ్రామీణ పరిధిలో రూ.500 కోసం స్నేహితుల మధ్య జరిగిన వివాదంలో ఒకరిని స్నేహితులే కొట్టి చంపారు.

"ప్రతి ఫ్రెండూ అవసరమే" - కానీ వీళ్లు మాత్రం వద్దు బ్రో! - Types Of Friends You Should Avoid

Rape in the Name of Friendship : స్నేహితులతో కలిసి వచ్చినందుకు.. నమ్మించి కాటేశాడు!

Last Updated : Jul 5, 2024, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.