How To Check How Many SIM Cards In My Name: అవసరం లేకపోయినా.. సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొంటుంటారు. వాటి అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు పెట్టి.. మళ్లీ కొత్తవి తీసుకుని ఉపయోగిస్తుంటారు. ఇలా ఒక్కొక్కరి పేరు మీదుగా లెక్కలేనన్ని సిమ్‌కార్డులు ఉంటాయి. అయితే టెలికామ్ యాక్ట్-2023 నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి వద్ద గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. మరి మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం ఒక్క నిమిషంలో ఇలా తెలుసుకోండి.
టెలికమ్యునికేషన్ యాక్ట్-2023 ప్రకారం, ఒక వ్యక్తి వద్ద గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఉండాలి. జమ్ము కశ్మీర్, అసోం, నార్త్ఈస్ట్ లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా(LSAs)ల్లో అయితే ఒక వ్యక్తి పేరుపై గరిష్ఠంగా 6 సిమ్ కార్డులే ఉండాలి. ఈ రూల్ 2024 జూన్ 26 నుంచే అమల్లోకి వచ్చింది. ఒకవేళ ఈ పరిమితికి మించి మీరు సిమ్ కార్డులు కలిగి ఉంటే గరిష్ఠంగా 2 లక్షల రూపాయల పెనాల్టీతోపాటు, మూడు సంవత్సరాల జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. మరి మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..
మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోండిలా: మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో 'సంచార్ సాథి' (Sanchar Saathi) వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే..
- ముందుగా మీరు సంచార్ సాథి అధికారిక వెబ్సైట్ https://www.sancharsaathi.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో Citizen Centric Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Know Your Mobile Connection ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, Validate Captcha పై క్లిక్ చేయాలి.
- క్యాప్చా వ్యాలిడేట్ అవ్వగానే, మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- వెంటనే ఓ కొత్త వెబ్‌పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరుపై ఎన్ని కనెక్షన్లు (సిమ్ కార్డులు) ఉన్నాయో కనిపిస్తాయి.
- ఈ సిమ్ కార్డుల పక్కనే Not My Number, Not Required, Required అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీకు తెలియకుండా మీ పేరుపై ఉన్న యాక్టివ్ సిమ్ కార్డ్‌ను డిస్కనెక్ట్ చేయడానికి Not My Number పై క్లిక్ చేయాలి.
- మీకు ఇకపై అవసరం లేని సిమ్ కార్డ్‌ను డిస్కనెక్ట్ చేయడానికి "Not Required" పై క్లిక్ చేయాలి.
- ఒక వేళ మీ పేరుపై, మీకు అవసరమైన సిమ్ కార్డులే ఉంటే, అప్పుడు Requiredపై క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు Required ఆప్షన్‌పై క్లిక్ చేయకపోయినా ఏం ఫర్వాలేదు.
ఇప్పటికే చాలా సిమ్ కార్డులు తీసుకుని ఉంటే?: ఒక వేళ మీరు ఇప్పటికే చాలా సిమ్ కార్డులు తీసుకుని ఉంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ (DoT) 2021 డిసెంబర్ 7న జారీ చేసిన సూచనల ప్రకారం, వాటిని రీ-వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ దగ్గర 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే, వాటికి కచ్చితంగా రీ-వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా వాటిని సరెండర్ చేసుకోవచ్చు. లేదా ఇతరులకు బదిలీ చేయవచ్చు. అవసరం లేదనుకుంటే వాటిని డిస్కనెక్ట్ కూడ చేసుకోవచ్చు.
తరచుగా సిమ్ కార్డ్‌లు మారుస్తుంటారా? ఇకపై ఆ లిమిట్ దాటితే కొత్త SIM ఇవ్వరు తెలుసా?
సిమ్‌కార్డ్ స్కాం.. మీ ఆధార్ కార్డ్‌తో వేరేవాళ్లు మొబైల్ నంబర్ తీసుకున్నారా? చెక్ చేసుకోండిలా..