ETV Bharat / state

దీపావళి వేడుక : టపాసులు కాల్చడంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

వెలుగుల పండుగ వేళ - టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తతతోనే ఆనంద దీపావళి జరుపుకోవాలని అగ్నిమాపకశాఖ అధికారుల విజ్ఞప్తి

tips for happy and safe diwali
diwali safety tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 10:43 PM IST

Updated : Oct 31, 2024, 8:49 PM IST

Diwali Safety Precautions : దీపావళి వెలుగుల పండుగ. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే ఆనందాల వేడుక. అందరూ బాణసంచా కాల్చి హ్యాపీగా జరుపుకొంటారు. చిన్నారులకు పక్కనే ఉండి కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు లాంటి వాటిని కాల్చడంలో పేరెంట్స్​, ఇంట్లో పెద్దవాళ్లు సహాయం చేస్తుంటారు. తగు జాగ్రత్తలు చెబుతూ హెచ్చరిస్తూ వారి ఆనందాన్ని కుటుంబ సభ్యులు ఆస్వాదిస్తుంటారు. ఇక యువతీయువకులు అయితే లక్ష్మీ బాంబులు, పెద్ద పెద్ద క్రాకర్స్​ కాల్చుతూ పోటాపోటీగా సంబురాలు జరుపుకుంటారు. ఈ క్రమంలో టపాసులు పేల్చేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.

దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. చిన్నాపెద్ద అంతా కలిసి బాణాసంచా, మతాబులు కాల్చుతూ తమ ఆనందాన్ని పొందుతారు. ఈ క్రమంలో దీపాలంకరణలతో నిర్వహించుకునే దివాలి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, విషాదాన్ని దరిదాపులకు రానివ్వొద్దని అంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. బాణాసంచా విక్రయించే షాపు యజమానులు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని సూచించారు. దుకాణాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అప్రమత్తతోనే ఆనంద దీపావళిని జరుపుకోవాలని, అందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అటు బాణాసంచా విక్రేతలకు, ఇటు ప్రజలకు వివరించారు.

అనుమతులుంటేనే అమ్మకాలు :

✸ బాణాసంచా విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా షాపుల్లో ఇసుక, నీటి బకెట్లతో పాటు అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉండాలి.

✸ అన్ని అనుమతులు తీసుకోవాలి, అక్రమంగా మందుగుండ నిల్వచేస్తే కఠినచర్యలు తప్పవు

✸ బాణసంచా నిల్వ చేసే ప్రదేశాలు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.

✸ అగ్నిమాపక సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.

✸ బాణసంచా నిల్వ చేసే ప్రదేశాలకు దూరంగా నివాస ప్రాంతాలు ఉండేలా చూసుకోవాలి.

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి :

✸ పిల్లలు పటాకాలు వేసేటప్పుడు వారిని ఎప్పుడూ ఒంటరిగా వదలవద్దు.

✸ ప్రమాదకరమైన బాణసంచా జోలికి వెళ్లక పోవటం ఉత్తమం.

✸ శానిటైజర్‌ పూసుకొన్న చేతులతో టపాసులు ఎట్టిపరిస్థితుల్లోనూ కాల్చొద్దు.

✸ బాణసంచాతో ప్రయోగాలు చేయకండి. పొగ ఎక్కువగా వచ్చే వాటిని వాడకండి.

✸ విద్యుత్‌ స్తంభాలు, కరెంట్ తీగలు వద్ద టపాసులు పేల్చొద్దు.

✸ నైలాన్‌ దుస్తులు ధరించి బాణసంచా కాల్చొద్దు. ఈ వస్త్రాలకు మంటలు త్వరగా అంటుకొనే స్వభావం ఉంటుంది. కాటన్‌ బట్టలు మాత్రమే ధరించాలి.

✸ మందుగుండ కాల్చుతున్నప్పుడు ముఖం దగ్గరగా పెట్టొద్దు.

✸ ముందు జాగ్రత్తగా బకెట్‌తో నీళ్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ దగ్గర ఉంచుకోవాలి. ఇంట్లో కాకుండా ఆరు బయట బాణసంచా కాల్చాలి

✸ డ్రైనేజీల వద్ద టపాసులు పేల్చకూడదు. వాటి నుంచి కొన్ని రకాల కెమికల్స్​ వెలువడే అవకాశం ఉంది.

✸ మట్టితో తయారు చేసిన ప్రమిదలనే వీలైనంతవరకు వాడాలి.

మరీ ముఖ్యంగా :

✸ దీపావళి వేడుక వేళ పిల్లలను ఎల్లప్పుడూ పెద్దవారి పర్యవేక్షణలో ఉంచాలి.

✸ ఎమెర్జెన్సీ టోల్​ఫ్రీ నంబర్​లను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉదా: ఫైర్​ ఇంజిన్​ - 101 , అంబులెన్స్​ - 108

ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు దీపావళిని సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవచ్చు.

దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌ - దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు - ఆరోజే స్టార్ట్!

Last Updated : Oct 31, 2024, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.