Horticulture Diploma Courses Importance Fell Down In Telangana : అందమైన భవన సముదాయం, చదువులకు అనుకూలమైన తరగతి గదులు మొక్కలు, కూరగాయలకు తోడ్పాటునిచ్చే వాతావరణం ఆదిలాబాద్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉంది. పరిశోధనలకు అనువైన పదుల ఎకరాలతో కూడిన నల్లరేగడి భూములు కూడా ఉన్నాయి. అన్ని భాగానే ఉన్నప్పటికీ అధికారుల నిరాధారణతో ఉద్యానశాఖ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ స్వరాష్ట్రమైన తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట పురుడు పోసుకున్న ఉద్యానశాఖకు అనుబంధంగా ప్రభుత్వం రెండేళ్ల కోర్సులతో నిర్వహించే ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులను ప్రశేపెట్టింది.
పండ్లు, కూరగాయలపై పరిశోధనలు : ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్‌కర్నూర్ జిల్లా కొల్లాపూర్‌లో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసింది. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి, వరంగల్ జిల్లా తొర్రూర్, నల్గొండ జిల్లా మర్రిగూడలో ప్రైవేటు కళాశాలల నిర్వహణకు అనుమతిచ్చింది. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రెండేళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరటానికి అర్హులని నిర్ణయించినప్పటికీ కళాశాలల్లో ఉద్యోగుల భర్తీనీ, మౌళిక వసతుల కల్పన, పళ్లు, కూరగాయలపై చేసే పరిశోధనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
పాలిటెక్నిక్ డిప్లమాను ప్రభుత్వం ఇటీవల ఇంటర్మీడియట్‌తో సమానంగా పరిగణిస్తున్నప్పటికీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రభుత్వ పరమైన ఉద్యోగవకాశాలు లేకపోవటంతో వాటిల్లో చేరటానికి విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ప్రభుత్వ పరంగా తోడ్పాటును అందిస్తే ఉద్యానశాఖ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే వనరుగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాలు కల్పిస్తేనే ఆసక్తి పెరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. అన్నిరకాల పంటలకు అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది. కానీ దానికి ఉపయుక్తంగా ఉండే ఉద్యానశాఖలకు ప్రభుత్వం ఊతం అందికపోవడంతో నిర్వీర్యం అవుతున్నాయి.
"హర్టికల్చర్ డిప్లమో పాలిటెక్నిక్ కోర్సులు క్రమంగా మసకబారుతోంది. సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. అన్నిరకాల పంటలకు అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది. అనేక రకాల పండ్ల మీద పరిశోదనలు జరుగుతున్నాయి. సదుపాయాల కొరత ఉండటం వల్ల విద్యార్థులు కోర్సుల్లో చేరటం లేదు. వ్యవసాయ ఉధ్యానశాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంతో నిరాధారణకు గురవుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే హర్టికల్చర్ డిప్లమో పాలిటెక్నిక్‌లో సిబ్బందిని నియమించి నిధులు మంజూరు చేయాలి." _ డా. మురళీ, హర్టికల్చర్ ఆచార్యులు