ETV Bharat / state

జట్టు కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - నలుగురు మృతి, ఇద్దరికి గాయాలు - Road Accident in Konaseema District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 8:42 PM IST

Updated : May 14, 2024, 10:11 PM IST

Bus Was Hit The Workers in Konaseema District: కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జట్టు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, పదిమంది కూలీలు ట్రాక్టర్​లోకి ధాన్యం ఎగుమతి చేసి తాడు బిగిస్తుండగా వెనుక నుంచి వచ్చి వారిని బలంగా ఢీకొట్టింది.

Road Accident in Konaseema District
Road Accident in Konaseema District (Etv Bharat)

Bus Was Hit The Workers in Konaseema District: అంబేడ్కర్​ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం ఊడిమూడి రహదారిపై 10 మంది కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొనింది. రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు జట్టు కూలీలు దుర్మరణం చెందగా మరొ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు జి.పెద్దపూడి, మరొకరు ఆదిమూలవారిపాలెంకు చెందిన వారిగా తెలిసింది.

సీఐ జీపును ఢీకొట్టిన లారీ- తీవ్రంగా గాయపడ్డ పోలీసులు - CI Road Accident in Anantapur

Four People Dead in Bus Accident: రాజోలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఊడిముడి వద్ద ట్రాక్టర్లోకి ధాన్యం లోడు చేస్తున్న జట్టు కూలీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూకపెయ్యి శివ, వాసంశెట్టి సూర్యప్రకాశరావు, వీరి కట్లయ్య, చిలకలపూడి పండు అక్కడికక్కడే మృతి చెెందారు. చిలకలపూడి నాని, బోరుసు నాని ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు అమలాపురంలోని కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.

అలసత్వం, అజాగ్రత్త- వేరువేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు సహా 12మంది మృతి - People Died in Various Accidents

Two People Seriously Injured in Road Accident: పదిమంది జట్టు కూలీలు ట్రాక్టర్​లోకి ధాన్యం ఎగుమతి చేసి తాడు బిగిస్తున్న సమయంలో బస్సు వెనుక నుంచి వచ్చి వారిని బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవరు, కండక్టర్​తో కలిపి మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అద్దాలు పగిలిపోగా ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి డ్రైవర్​ నిర్లక్షమా లేక బస్సు అదుపుతప్పి వారిని ఢీకొట్టిందా అనేది తెలియాల్సి ఉంది.

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం - ఫ్లైఓవర్​పై డివైడర్​ను ఢీకొని ఇద్దరు మృతి - Visakha NAD Flyover Road Accident

Last Updated : May 14, 2024, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.