ETV Bharat / state

పిన్నెల్లి పరామర్శకు జగన్ రూ.25 లక్షలు ఖర్చు పెట్టాడు: అనిత - home minister anitha comments - HOME MINISTER ANITHA COMMENTS

Home Minister Anitha Comments on YS Jagan: పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌లు ముగిసినా మానవతా దృక్పథంతో జగన్‌కు అనుమతిచ్చామని హోంమంత్రి అనిత అన్నారు. జైలు నుంచి బయటికొచ్చాక జగన్ ఏదేదో మాట్లాడారని, పిన్నెల్లి పరామర్శకు రూ.25 లక్షలు ఖర్చు పెట్టి వెళ్లారని విమర్శించారు.

Home Minister Anitha Comments
Home Minister Anitha Comments (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 4:55 PM IST

Updated : Jul 4, 2024, 5:25 PM IST

Home Minister Anitha Comments on YS Jagan: ఈవీఎం ధ్వంసం చేసిన మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయనను పరామర్శించడానికి జగన్ 25 లక్షలు ఖర్చు పెట్టారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ హెలికాప్టర్‌లో వెళ్లి పరామర్శించారన్నారు.

జైల్లో పిన్నెల్లికి ఇచ్చిన ములాఖత్​లు ముగిసిన తర్వాత కూడా మానవతా దృక్పథంతో జగన్​కు అనుమతి ఇచ్చామని హోం మంత్రి తెలిపారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికే వెళ్లినట్లు అర్ధమవుతోందని ఆమె పేర్కొన్నారు. జైలు నుంచి బయటకొచ్చిన జగన్ ఏదేదో మాట్లాడారని అన్నారు. ములాఖాత్​లపై జైళ్లశాఖ ఐజీ నుంచి సైతం నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు. తనపై గత ప్రభుత్వం అట్రాసిటీ కేసులు పెట్టిందని, గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేస్తామన్నారు. న్యాయపరంగా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అనిత తెలిపారు.

పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారు - జగన్ ఆవేదన - jagan met pinnelli ramakrishna

TDP Srinivasa Reddy Comments: జగన్ ప్రజలకు మొహం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు మొహం చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్​ అధికారం పోయిన ఫ్రస్టేషన్​లో నెల్లూరు జైల్ వద్ద మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం పోయి ఇప్పుడు ఏపీలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పారు. చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్​కు లేదన్నారు.

జైల్లో పిన్నెల్లితో జగన్ ములాఖత్​ - ఏం సందేశం ఇస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్స్ - YS Jagan Meet Pinnelli

Somireddy Chandramohan Reddy Comments: జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆయన అన్నీ డోర్ డెలివరీ చేశారంట, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి కేసులో చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందని జగన్ చెబుతున్నారని, జగన్ మీద చిన్నగులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైలులో పెట్టిన విషయం గుర్తులేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

భుజంపై బఠానీ గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుని ఐదేళ్లు జైలులో పెట్టించారని మండిపడ్డారు. కులం చూడలేదంట, మతం చూడలేదంట, పార్టీ చూడలేదంట. కక్షసాధింపుల్లో అందరినీ సమానంగా జగన్ చూశారని ధ్వజమెత్తారు. ఈవీఎం పగలకొడితే తప్పేంటని మాజీ ముఖ్యమంత్రి అనడం చాలా దురదృష్టకరమని సోమిరెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్యం, ఎన్నికల కమిషన్​పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టడం కాదని, మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైఎస్సార్సీపీ ఉంటుందో లేదో చూసుకోండని సూచించారు. మీరు మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టే ఈ రోజు అనుభవిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు.

రెండు దశాబ్దాలపాటు అరాచకం - లెక్కకు మించిన తప్పులు - ఎట్టకేలకు కటకటాల వెనక్కు - pinnelli ramakrishna reddy anarchy

Last Updated : Jul 4, 2024, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.