ETV Bharat / state

నూతన రింగ్​బండ్​కు భారీ గండి - మళ్లీ మొదటికి పెద్ద వాగు కథ - Hole for ring bund at Peddavagu

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 10:48 AM IST

Pedda Vagu Flood Problem : అశ్వారావుపేటలోని పెద్దవాగు కథ మళ్లీ మొదటికి వచ్చింది. జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రింగ్​బండ్​కు 30 మీటర్ల భారీ గండి పడింది. శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈ గండి ఏర్పడింది.

Pedda Vagu Flood Problem
Pedda Vagu Flood Problem (ETV Bharat)

Pedda Vagu Flood Problem in Telangana : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో ఉన్న పెద్దవాగు జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న రింగ్​బండ్​కు 30 మీటర్ల భారీ గండి పడింది. జులై 18న భారీ వరదలకు ఈ ప్రాజెక్టు కట్ట ధ్వంసం అయింది. అలాగే స్పిల్​వే పక్కనే 250 మీటర్ల మేర గండి పడిన సంగతి తెలిసిందే. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.3.50 కోట్లతో ప్రభుత్వం రింగ్​బండ్​ నిర్మాణాన్ని చేపట్టింది. రింగ్​బండ్​ నిర్మాణంలో పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇంతలో శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు జలాశయంలోకి భారీగా వరద చేరింది.

శనివారం ఉదయం నుంచి స్పిల్​వే గేట్ల నుంచి నీరు ప్రవహించింది. వరద ఉద్ధృతి పెరిగి రింగ్​బండ్​ పై నుంచీ కూడా ప్రవహించింది. దీంతో భారీగా గండిపడింది. రింగ్​బండ్​ వద్ద పెద్ద ఎత్తున ఇసుకబస్తాలు పేర్చిన అవీ కొట్టుకుపోయాయి. గండి కారణంగా సుమారు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.