Vijayawada Rammohan Library History : స్వాతంత్య్ర సంగ్రామం వేళ దేశభక్తి, పోరాటస్ఫూర్తి నింపడంలో ఆ గ్రంథాలయం కీలకంగా నిలిచింది. 112 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ లైబ్రరీ నేటికీ ఎందరికో విజ్ఞానసంపద పంచుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్ర బిందువుగా నిలిచిన ఆ గ్రంథాలయం విశేషాలేంటో తెలుసుకుందాం!
రామ్మోహన్ లైబ్రరీని మూడు సార్లు సందర్శించిన గాంధీజీ : ఎన్టీఆర్ విజయవాడలోని ప్రఖ్యాత రామ్మోహన్ గ్రంథాలయమిది! 112 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయం భారత జాతీయోద్యమంలో కీలకంగా వ్యవహరించింది. మహాత్మా గాంధీ ఈ లైబ్రరీని మూడు సార్లు సందర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమానికీ (Quit India Movement) ఇక్కడి నుంచే రూపకల్పన జరిగినట్లు లైబ్రరీ నిర్వాహకులు చెబుతారు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా, మాడపాటి హనుమంతరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు వంటి మహామహులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు.
డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books
స్వాతంత్య్ర కోసం విజయవాడలో వెలసిన అనేక సంస్థలు, సంఘాలు, సాగిన ఉద్యమాలకు ఈ గ్రంథాలయమే కేంద్ర నిలయంగా నిలిచింది. ప్రముఖ సంస్కర్త రాజారామ్మోహన్‌రాయ్ పేరును ఈ గ్రంథాలయానికి పెట్టారు. గతంలో దీన్ని రామ్మోహన్ ధర్మ పుస్తక భాండాగారం, రామ్మోహన్ ఉచిత లైబ్రరీ, రీడింగ్ రూమ్‌గా కూడా పిలిచేవారు.
గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం : రామ్మోహన్ గ్రంథాలయంలో ప్రస్తుతం వివిధ విభాగాలకు సంబంధించిన సుమారు 18 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు, చిన్నారులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి ఉపయోగపడే వేలాది పుస్తకాలు ఇక్కడ పొందుపరిచారు. తెలుగు, ఆంగ్ల వార్తా పత్రికలు అందుబాటులో ఉంటాయి. సాంకేతికత పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక కాలంలోనూ పదుల సంఖ్యలో పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి పుస్తకాలు వల్లె వేస్తుంటారు.
Free Books పుస్తక ప్రియులకు శుభవార్త.. ఉచితంగా పుస్తకాల పంపిణీ
ఎంజీ రోడ్డుకు మార్పు : 1903లో సత్యనారాయణపురంలో ప్రారంభమైన ఈ గ్రంథాలయాన్ని తర్వాతి రోజుల్లో ఎంజీ రోడ్డుకు మార్చారు. ఈ పుస్తక భాండాగారం ఏర్పాటుకు అయ్యంకి వెంకట రమణయ్య, సూరి వెంకట నరసింహశాస్త్రితో పాటు మరికొందరు కీలకంగా వ్యవహరించారు.
Horse Library : గుర్రంపై మినీ లైబ్రరీ.. ఊరూరా తిరుగుతూ.. విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతూ..