ETV Bharat / state

హిందూపురంలో వైఎస్సార్సీపీకు ఎదురుగాలి - మార్పు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు - Hindupur Parliament review - HINDUPUR PARLIAMENT REVIEW

TDP Winning Chances in Sri Sathya Sai District : వైఎస్సార్సీపీ నేతల అవినీతి, అక్రమాలు, సొంత పార్టీలోనే అసంతృప్తులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇవన్నీ కలగలిపి హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీకు ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వ్యూహాలకు పదును పెడుతూ ఈ సారి ఎలాగైనా అన్ని స్థానాల్లోనూ పాగా వేయాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది. అభివృద్ధి, సంక్షేమం అజెండాతో కూటమి అభ్యర్థులు ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు.

TDP_Winning_Chances_in_Sri_Sathya_Sai_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 4:45 PM IST

TDP Winning Chances in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీకు ఎదురుగాలి విస్తోంది. ప్రత్యర్థిని ఓడించేందుకు కూటమి నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో మెుత్తం స్థానాలను కైవసం చేసుకోవడానికి సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెలుతున్నారు. అలాగే వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, అసంతృప్తులు, వ్యతిరేకతలాంటి అన్నింతో హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ అన్ని స్థానాల్లో ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బాలకృష్ణ - వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపు

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల వ్యవహారం : హిందూపురం పార్లమెంటు పరిధిలో హిందూపురం, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 16,39, 941 మంది ఓటర్లు ఉన్నారు. హిందూపురం నుంచి తెలుగుదేశం తరఫున బీకే పార్థసారథి వైసీపీ నుంచి జె. శాంత బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల వ్యవహారం వైసీపీను ఇరుకున పెట్టడంతో ఆయన్ను పక్కన పెట్టేశారు. మాధవ్ స్థానంలో కర్ణాటకకు చెందిన శాంతను ఈసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. స్థానికేతరాలు కావడంతో ఈమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే కురబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథిని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. పార్థసారథి గతంలో తెలుగుదేశం నుంచి రెండు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంపై బాగా పట్టు ఉండటం, ప్రజల్లో మంచి పేరు ఉండటంతో పార్థసారథికి గెలుపు నల్లేరుమీద నడకేనని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

సాయి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి : 2021లో జిల్లా పునర్విభజన జరిగాక పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడింది. యువతకు ప్రాధాన్యమివ్వాలనే లక్ష్యంతో అభ్యర్థులను ఎంపిక చేసిన తెలుగుదేశం పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డికి అవకాశం కల్పించింది. విద్యావంతురాలైన సింధూర ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డినే వైసీపీ మరోసారి బరిలోకి దించింది. అయితే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్తి నేతలు పని చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే భావన ప్రజల్లోనూ బలంగా ఉంది. పుట్టపర్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భవనాల్లో కార్యాలయాలు నిర్వహించడంపై సాయి భక్తుల్లోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే దుద్దుకుంటను ఇంటికి పంపేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు.

ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపురం కంచు కోట : నందమూరి తారకరామారావు కుటుంబానికి హిందూపురం కంచు కోట. హిందూపురంలో మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి ప్రత్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ తాజాగా తెలుగుదేశంలో చేరారు. ఇక్బాల్ ఓటమితో హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో వైసీపీలోనే మూడు అసమ్మతి గ్రూపులు తయారై రాళ్లదాడులు చేసుకునే వరకు వచ్చింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి దీపిక పోటీలో నిలిచారు. బెంగుళూరులో ఉంటున్న దీపికకు నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేదు. అసమ్మతి నేతలు ఆమెకు పూర్తిగా సహకరించట్లేదు. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్న తరుణంలో బాలకృష్ణ హాట్రిక్ సాధిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

అన్ని సర్వేలు టీడీపీ గెలుపు తథ్యమని వెల్లడి : పునర్విభజనలో భాగంగా హిందూపురం పార్లమెంటు పరిధిలో కొత్తగా ఏర్పాడిన మరో నియోజకవర్గం రాప్తాడు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై పరిటాల సునీత పోటీ చేశారు. మరోసారి పరిటాల సునీతను తెలుగుదేశం బరిలో నిలిపింది. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి అరాచకాలను ఎండగడుతూ ప్రజాదరణను పొందడంలో సునీత విజయవంతమయ్యారు. ఈసారి అన్ని సర్వేలు సునీత గెలుపు తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెనుకొండ ఒకటి. తెలుగుదేశం తరఫున కురబ సామాజిక వర్గానికి చెందిన సవిత పోటీ చేస్తున్నారు. ఈమె ప్రత్యర్థిగా మంత్రి ఉషశ్రీ చరణ్ బరిలోకి దిగారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన ఆమెకు కళ్యాణదుర్గంలో ఓటమి తప్పదని గుర్తించిన వైసీపీ అధిష్టానం ఉషను పెనుకొండకు బదిలీ చేసి పోటీలో నిలిపింది. ఉషశ్రీ చరణ్ అవినీతి బాగోతాన్ని ఆయుధంగా మలచుకుని సవిత ప్రచారంతో దూసుకుపోతున్నారు.

"ప్రఖ్యాతిగాంచిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన కదిరిలో ఐదేళ్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సిద్దారెడ్డి ఏ అభివృద్ధి చేయలేదు. అవినీతి ఆరోపణలు, క్యాడర్‌ను పట్టించుకోవవట్లేదనే కారణాలతో సిద్దారెడ్డిని అధిష్టానం పక్కన పెట్టింది. ఆయన స్థానంలో మగ్బూల్ అహ్మద్‌ను బరిలో దింపింది. బెంగుళూరులో వ్యాపారం చేస్తూ కదిరికి దూరంగా ఉన్న మగ్బూల్‌కు వైసీపీ నాయకులతో కనీస పరిచయాలు లేవు. తెలుగుదేశం తరఫున నన్ను పోటీలో నిలబెట్టారు. కదిరిలో తెలుగుదేశానికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి." - కందికుంట వెంకటప్రసాద్, కదిరి టీడీపీ అభ్యర్థి

గుడ్ మార్నింగ్ పేరుతో ఖాళీ స్థలాలు కాజేశారు : హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన మడకశిర అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. వైసీపీ ఈర లక్కప్పను బరిలోకి దించింది. తొలుత వీరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్​కు తెలుగుదేశం టికెట్ ఇచ్చింది. అనివార్య కారణాలతో సునీల్‌ను తప్పించి ఎమ్మెస్ రాజును బరిలో దింపారు. అభ్యర్థిత్వం చేజారి పోవడంతో సునీల్ కుమార్ తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా మారారు. సమస్యలపై గళమెత్తుతూ ప్రజల్లో మంచి పేరు ఉండటం M Sరాజుకు కలిసొచ్చే అంశం.

ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పరిటాల శ్రీరామ్‌కు టికెట్‌ను ఇస్తారని అంతా భావించారు. అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్‌ను భాజపాకు ఇచ్చారు. ఎన్టీయే కూటమి అభ్యర్థిగా ధర్మవరంలో భాజపా నుంచి బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్ యాదవ్ పోటీలో నిలిచారు. భూ కబ్జాలు, ఇసుక, మట్టి మాఫియా వెనుక సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ మరోసారి ఆయనకే వైసీపీ టికెట్ కట్టబెట్టింది. గుడ్ మార్నింగ్ పేరుతో ఖాళీ స్థలాలు కాజేశారనే అపవాదును మూటకట్టుకున్నారు. నేతన్నలు, పట్టు చీరల వ్యాపారులను వేధించారన్న ఆరోపణలూ కేతిరెడ్డిపై ఉన్నాయి. వీటన్నిటి ఫలితంగా ఈ సారి ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు.

హిందూపురంలో బీసీ ఓటర్లే బలం - సైకిల్​ జైత్రయాత్ర సాగించిన ఎన్టీఆర్​ - Hindupur LOK SABHA ELECTIONS

ఇక దబిడి దిబిడే - ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి బాలకృష్ణ - Balakrishna Election campaign

హిందూపురంలో వైఎస్సార్సీపీకు ఎదురుగాలి - మార్పు ఖాయమంటున్న రాజకీయ విశ్లేషకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.