High Court Serious on Police About Helmet Issue : రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్లను ధరించే నిబంధనను పోలీసులు అమలు చేయకపోవటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవటం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా మంది హెల్మెట్ లేకపోవటం వల్ల 667 మంది మృతి చెందారని పిటీషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మృతులకు ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఎందుకు హెల్మెట్లను ధరించే నిబంధన అమలు చేయటం లేదని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది.
తదుపరి విచారణ వాయిదా : ట్రాఫిక్ విభాగంలో 8 వేల మందికి సిబ్బంది అవసరం ఉండగా 1800 మాత్రమే ఉన్నారని పోలీసు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫైన్లు వేసినా కట్టడం లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా న్యాయస్థానం ఇంప్లీడ్ చేసింది. వారంలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల అమలుపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
హెల్మెట్ ధరించేవారే కనిపించడం లేదు - అఫిడవిట్ దాఖలుకు హైకోర్టు ఆదేశం - HIGH COURT ON HELMET