High Court on Telangana Engineering Colleges : కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల కుదింపు, సీట్ల పెంపు వ్యవహారంలో ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతున్నందున జేఎన్టీయూ, ఏఐసీటీఈలు అనుమతించిన సీట్లకు కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూలు పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం, రద్దుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 24న జారీ చేసిన మెమోతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన సాంకేతిక విద్యా చట్టంలోని సెక్షన్ 20ని సవాల్ చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యా జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, సీఎంఆర్ ఎడ్యుకేషన్ సొసైటీలతో పాలు పలు కాలేజీలు వేర్వేరుగా 11 పిటిషన్లు దాఖలు చేశాయి.
Telangana Private Engineering Colleges : ఈ పిటిషన్లు మొదట ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇది సింగిల్ జడ్జి తేల్చాల్సిన అంశమంటూ పేర్కొంటూ సింగిల్ జడ్జికి నివేదించింది. వీటిపై జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం కౌన్సెలింగ్ కొనసాగుతోందని చెప్పారు. కౌన్సిలింగ్లో తమ కాలేజీలకు అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జేఎన్టీయూ, ఏఐసీటీఈ ఆమోదం తెలిపిన పెంపు సీట్ల భర్తీకి అవకాశం కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
పిటిషన్లు కొట్టివేత : ఈ క్రమంలో అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ 2024-25 విద్యాసంవత్సరం ఆగస్టు 19 నుంచే ప్రారంభమైందన్నారు. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూలు పూర్తయినందున, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
క్రీడాభివృద్ధి భూముల కేటాయింపు కేసు వాయిదా : క్రీడాభివృద్ధి కోసం భూముల కేటాయింపులతో పాటు స్టేడియంల నిర్వహణ బాధ్యతను ఐఎంజీ భారత అకడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ జరిపిన భూకేటాయింపుల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
తుది తీర్పునకు లోబడే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ : హైకోర్టు - TELANGANA HC ON GROUP 4 RESERVATION